శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌..

ఇకపై సమస్త సమాచారం ఒకే యాప్‌లో

1
TMedia (Telugu News) :

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌

-ఇకపై సమస్త సమాచారం ఒకే యాప్‌లో

లహరి, డిసెంబరు 9, తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు ఆలయానికి సంబంధించిన పూర్తి సమచారాన్ని తెలుసుకోవడం సాధారణమైన విషయం. రూమ్‌లు, దర్శనం టికెట్లు, దర్శన సమయాల్లో మార్పులు చేర్పులు ఇలా ఎంతో సమాచారం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు భక్తులు ఈ సమాచారం తెలుసుకోవడానికి టీడీడీ అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించే వారు.

కానీ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇందుకోసం ఓ యాప్‌ను తీసుకొస్తున్నారు. భక్తుల కోసం సమస్త సమాచారాన్ని అందించే విధంగా ఈ యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే గోవింద పేరుతో ఓ యాప్‌ అందుబాటులో ఉన్నా. ఇందులో పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఈ ఉద్దేశంతో టీటీడీ తాజాగా కొత్త యాప్‌ను తీసుకొస్తోంది ఐటీ విభాగం. ఇప్పటికే యాప్‌‌ దాదాపు పూర్తికాగా.. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. టీటీడీ తీసుకొస్తున్న ఈ యాప్‌ ద్వారా పూర్తి సమచారాన్ని పొందొచ్చు. ఇదిలా ఉంటే భక్తులు ప్రస్తుతం దర్శనం, రూమ్‌ బుకింగ్ వంటివి టీటీడీ వెబ్‌సైట్‌లో చేసుకుంటున్నారు. కానీ ఈ యాప్‌ అందుబాటులోకి వస్తే ఇకపై దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు.

Also Read : ఈ సూత్రాలను పాటించి చూడండి.. సంతోషకరమైన జీవితం మీ సొంతం

అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. అంతేకాకుండా టికెట్లకు సంబంధించిన ఛార్జీలను కూడా చాలా సులభంగా యాప్‌ ద్వారా చెల్లించవచ్చని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యాప్‌తో భక్తులు మరింత సులభంగా శ్రీవారి దర్శనం పొందగలుగుతారని అధికారులు చెబుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube