విక్రయ శిశువును తల్లికి అప్పగించిన యస్ ఐ

విక్రయ శిశువును తల్లికి అప్పగించిన యస్ ఐ

1
TMedia (Telugu News) :

విక్రయ శిశువును తల్లికి అప్పగించిన యస్ ఐ

టీ మీడియా, మార్చి 30, అశ్వారావుపేట:నియోజకవర్గ కేంద్రం లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డ ను అమ్మిన కేసును ఛేదించిన అశ్వారావుపేట పోలీసులు. యస్ ఐ చల్లా అరుణ తెలిపిన వివరాలు ప్రకారం ఈనెల 27 వ తేదీన ఐసిడిఎస్ సిబ్బంది నుంచి మగ శిశువు అమ్మకం పై అందిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక పోలీస్ బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి ఆచూకీ తెలుసుకున్నాం అని ఆ శిశువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం లో విక్రయించినట్లు గుర్తించాం అని,ఆ శిశువును అశ్వారావుపేట కు రప్పించి ఫిర్యాదుదారులైన ఐసిడిఎస్ సిబ్బంది సమక్షంలో మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో తల్లికి అప్పగించడం జరిగిందని, శిశు విక్రయం ఉదంతంలో విచారణ చేపట్టి నిందితులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని,శిశువు ల క్రయ విక్రయాలు చట్టపరంగా శిక్షార్హం అని ఇటువంటి ఘటనలు ఎక్కడైనా చోటుచేసుకుంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : భట్టి విక్రమార్క పాదయాత్రను జయప్రదం చేయండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube