శుభ‌కృత్‌లో అంతా శుభం జ‌ర‌గాలి

మంత్రి హ‌రీశ్‌రావు

1
TMedia (Telugu News) :

శుభ‌కృత్‌లో అంతా శుభం జ‌ర‌గాలి : మంత్రి హ‌రీశ్‌రావు
టీ మీడియా,ఏప్రిల్1 ,సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. తెలుగు నూతన సంవత్సరాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా పనిచేస్తుందని, ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాల‌న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం సంతృప్తినిచ్చింద‌న్నారు. కాళేశ్వరం జలాలతో కాలువలు, చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా నిండి ఉన్నాయని, రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లుతున్నారు. ఈ కొత్త సంవత్సర పర్వదినం అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్న‌ట్లు హ‌రీశ్‌రావు తెలిపారు.

Also Read : మ‌ద్యం మ‌త్తులో యువ‌కుల వీరంగం అమ్మాయిల‌తో అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube