పాడె మోసిన మంత్రి

పాడె మోసిన మంత్రి

1
TMedia (Telugu News) :

పాడె మోసిన మంత్రి

టీ మీడియా, మార్చి 30, వనపర్తి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మలిదశ తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మనిగిల్ల నాగిరెడ్డి పాడె మోశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గ్రామానికి చేరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగిరెడ్డి అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. 2001 మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని మండల టిఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందని బాధపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : వలస ఆదివాసీలకు దుస్తులు పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube