ఒక్క క్లిక్‌తో వీధి వీక్షణం
గూగుల్ మ్యాప్‌లో స్ట్రీట్ వ్యూ ఫీచర్
టీ మీడియా, జూలై 28, హైదరాబాద్: గూగుల్ మ్యాప్స్ యూజర్లకు శుభవార్త. యూజర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇండియాలో గూగుల్ మ్యాప్స్ సేవలు ప్రారంభమై చాలా కాలమైనా ఇప్పటి వరకు స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. గూగుల్ మ్యాప్స్ అందిస్తున్న పాపులర్ ఫీచర్స్‌లో ఇది కూడా ఒకటి. ఎట్టకేలకు ఇండియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాంచ్ చేస్తున్నట్టు తాజాగా గూగుల్ ప్రకటించింది. ఇండియాలో ఈ సౌకర్యాన్ని అందించేందుకు మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ అయిన జెనిసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సహకారాన్ని గూగుల్ తీసుకుంటుంది. హైదరాబాద్ సహా మొదట 10 నగరాల్లో ఈ సేవలను ప్రారంభించామని గూగుల్ పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి మరో 50 నగరాల్లోనూ ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు గూగుల్ తెలిపింది. గూగుల్ సంస్థ ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 1,50,000 కిలో మీటర్ల దూరాన్ని స్ట్రీట్ వ్యూలో కవర్ చేసింది.
Also Read : శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
దేశంలో మొదటి సారిగా 2011లో..
గూగుల్ ప్రస్థానం వివిధ రకాలుగా ఉంది. అందులో భాగంగానే గూగుల్ మ్యాప్‌ను ప్రారంభించగా, ఆ తర్వాత స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. దీన్ని దేశంలో మొదటిసారిగా 2011లో
తీసుకువచ్చింది. కాగా, స్ట్రీట్ వ్యూ పేరిట చిత్రాలు సేకరించడంపై అప్పట్లో ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ టెక్నాలజీ వల్ల భద్రతాపరంగా ముప్పు పొంచి ఉన్నదన్న కారణంతో 2016లో దీనిపై నిషేధం విధించింది. చాలా
కాలం తర్వాత మళ్లీ ఇప్పుడు స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.
స్ట్రీట్ వ్యూ ఫీచర్‌తో ఉపయోగం ఇలా..
ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రాంతాలను (లొకేషన్స్) తెలుసుకోగలుగుతున్నాం. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎంత దూరమో తెలుసుకుంటున్నాం. ఎకడ ట్రాఫిక్ ఎలా ఉన్నదో చూడొచ్చు. జీపీఎస్ సాయంతో రూట్ ఫాలో కావొచ్చు. తాము వెళ్లాలనుకున్న ప్రదేశాలు ఎకడ ఉన్నాయో మ్యాప్ సహాయంతో చూడొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ మహానగరంలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఉపయోగిస్తే ఏ ప్రాంతం ఎలా ఉందో తెలుసుకునేందుకు మ్యాప్‌లో బూ ్లకలర్లో కొన్ని చుక్కలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వీధులు, ఇండ్లను 360 డిగ్రీల కోణంలో హై క్వాలిటీతో కూడిన చిత్రాలను గూగుల్ మ్యాప్‌లోని స్ట్రీట్ వ్యూ ఫీచర్ ద్వారా చూడవచ్చు. గూగుల్ సంస్థ మ్యాప్స్ ద్వారా మరింత సమాచారాన్ని యూజర్లకు అందించేందుకు స్థానిక ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కలిసి పనిచేసి రోడ్లపై వేగానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచుతున్నది.
Also Read : శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
గూగుల్ స్ట్రీట్ వ్యూ చూడాలంటే..
ముందుగా గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సెర్చ్ చేయాలి. ఉదాహరణకు బంజారాహిల్స్ అని సెర్చ్ చేస్తే ఆ ఏరియా మ్యాప్ కనిపిస్తుంది. మీరు చూడాలనుకుంటున్న ఏరియా పిన్ చేయాలి. ఆ ఏరియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ కనిపిస్తే ఆ ఐకాన్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి. ఆ తర్వాత ఆ ఏరియా మొత్తం స్ట్రీట్ వ్యూలో కనిపిస్తుంది. ఇలా నగరంలోని చాలా ప్రాంతాలను, ముఖ్యంగా పేరొందిన ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube