కుక్కల తండాలో ఘోరం
– అస్థి తగదాల్లో 8 మంది బందువుల పై దాడి
-చావు బ్రతుకల మధ్య వృద్దుడు
-.నిందితులు స్వేచ్ఛ గా తిరుగుతున్నారు:బాధితులు
టీ మీడియా,జూలై 27,ఖమ్మం:జిల్లా లోని తిర్ములాయ పాలెం మండలం కుక్కల తండాలో ఈ నెల 23 న (అధివారం)ఘోరం జరిగింది. తమ భూమి కబ్జా చేసి తమ కుటుంబ సభ్యులు 8 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయరిచారాని ,కొట్టిన వారు తమకు బందువులు అని బాధితులు తెలిపారు.దాడి జరిగిన రోజు పోలీస్ కి పిర్యాదు చేశామని ఇస్లవత్ శిల్ప(సెల్:94 94316442)టి మీడియా కి గురువారం తెలిపారు.నిందితులు తమ గ్రామానికి చెందిన వారు అని, తీవ్రంగా గాయపడిన ఇస్లవత్ భద్రు తలకు తీవ్ర గాయాలయ్యాయి అని అతని వయస్సు 55యేళ్లు ,హైద్రాబాద్ లో చికిత్య పొందుతున్న అయన పరిస్థితి విషమంగా ఉంది అన్నారు. మిగిలిన వారు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో అడ్మిట్ అనంతరం, ప్రస్తుతం ఓపి చికిత్యా పొందుతున్నారు అన్నారు. దాడి చేసిన వారు స్వేచ్ఛగా తిరుగుతున్న రని ఆరోపించారు .నిందితుల తక్షణం చర్యలు తీసు కోవాలని కోరారు
also read ;ఆహార సంస్థ (గోదాం ల) భద్రత కుంభ కోణం
దాడి చేసిన వారిలో కుక్కల తండాకు చెందిన ఇస్లవత్ సేవా,కిషన్, పవన్ ,ప్రసాద్ బొడారవి, మరికొందరు మహిళలు ఉన్నారని తెలిపారు.వీరు ఇనుప రాడ్ లు,కర్రలు,రాళ్ల తో దాడి చేయటం తో మాకు తలలు పగిలాయి అన్నారు.గాయ పడ్డ వారిలో బద్రు, బాలు,కవిత, విజయ,బుజ్జి,సుమన్, వెంకన్న తదితరులు ఉన్నారు అన్నారు.మధ్యాహ్నం 3 గంటల సమయం లో దాడి జరుగగా 108 ద్వారా ,ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరిలించారనీ శిల్ప వ్రాత పూర్వకంగా తెలిపారు.