గోధావరిఖని లో ఘణంగా గోరింటాకు పండుగ

ముఖ్య అతిధిగా హాజరైన పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి

1
TMedia (Telugu News) :

గోధావరిఖని లో ఘణంగా గోరింటాకు పండుగ

ముఖ్య అతిధిగా హాజరైన పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి

టీ మీడియా,జులై 29, గోదావరిఖని :

గోధావరిఖని,గణేష్ నగర్ కాలనీలోని
శ్రీ లక్ష్మీ గణపతి మిత్ర మండలి మహిళలు అంతా కలిసి ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని గురువారం పెద్ద ఎత్తున గోరింటాకు పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి ముఖ్య అతిధిగా హజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

Also Read : అంగన్వాడీ లకు శిక్షణ

ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ…
ఆషాడ మాసంలో ప్రతి మహిళ గోరింటాకును పెట్టుకోవాలన్న ఆనవాయితీని నాటి కాలం నుండే కొనసాగుతుందని తెలియజేశారు. గ్రీష్మ రుతువు ముగిసి వర్ష రుతువు ప్రారంభమవుతుందని,అయితే గ్రీష్మంలో శరీరంలో వేడి ఎక్కువగా ఉండి బయట వాతావరణం చల్లగా ఉంటుందని గోరింటాకుకు ఉన్న ప్రత్యేక గుణం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత ని తగ్గిస్తుందని అందుకే ఆషాడంలో గోరింటాకు అరచేతులకు, పాదాలకు పెట్టుకోవడం మంచిదని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుర్రం వీణ,సత్యవతి,గుండ రేఖ,వినోధ,శ్రీదేవి,స్వాతి,రేవతి,లావణ్య,శశి రేఖ,శారధ,ప్రభ,పద్మజ తదితరులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube