ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ ను ప్రారంభించాలి

ఎటువంటి ఫీజు తీసుకోకుండా హాస్టల్ నడపాలి.

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ ను ప్రారంభించాలి.

– ఎటువంటి ఫీజు తీసుకోకుండా హాస్టల్ నడపాలి.

టీ మీడియా, జూన్22,మధిర: మండలం లోని కాజీ పురం ఉన్న మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కు అనుసంధానంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ హాస్టల్ ను విద్యార్థులు వద్ద నుండి ఎటువంటి ఫీజు తీసుకోకుండా హాస్టల్ ప్రారంభించాలని ఏ ఐ ఎస్ ఎఫ్ మధిర నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రామస్వామి వినతి పత్రం అందజేశారు.

Also Read : వాటర్ ప్లాంట్ కేసులో స్టేషన్ బెయిల్

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూమధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అనుసంధానంగా 560 లక్షల ఖర్చుతో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరావు శంకుస్థాపన చేసి ఏర్పాటుచేసిహాస్టల్ నిర్మాణం జరిగి మూడు సంవత్సరాలు గడిచిన హాస్టల్ ను ప్రారంభించిన పోవడం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాల నుండి మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించడానికి వస్తుండగా హాస్టల్ లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కె సి ఆర్ ప్రభుత్వం కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కానీ విద్యార్థులకు మాత్రం వసతి కల్పించడంలో విఫలమైంది అని తక్షణమే విద్యార్థుల నుండి ఎటువంటి తీసుకోకుండా ఈ విద్యాసంవత్సరం నుంచి హాస్టల్ ను ప్రారంభించాలని లేనిపక్షంలో ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు యంగల ఉజ్వల్ కొంగర నరేంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube