పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వ హాస్పిటళ్లు: మంత్రి ఎర్రబెల్లి

పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వ హాస్పిటళ్లు: మంత్రి ఎర్రబెల్లి

1
TMedia (Telugu News) :

పేదల పెన్నిధిగా మారిన ప్రభుత్వ హాస్పిటళ్లు: మంత్రి ఎర్రబెల్లి

టీ మీడియా, డిసెంబర్ 16, హనుమకొండ : ప్రభుత్వ దవాఖానలు పేదల పెన్నిధిగా మారాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల్లోనే నార్మల్‌ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఆర్మూరు జిల్లా కోర్టులో జూనియర్‌ జడ్జిగా సేవలు అందిస్తున్న రాచర్ల శాలిని.. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌తో కలిసి హాస్పిటల్‌కు వెళ్లిన మంత్రి.. శాలినిని అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా జడ్జిగా ఉండి ప్రభుత్వ దవాఖానలో ప్రసవించడం ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందించినట్లయిందన్నారు.వరంగల్ జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ హాస్పిటళ్లను రివ్యూ చేసినప్పుడు ప్రభుత్వ దవఖానాల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరుగుతున్నాయని తేలిందన్నారు. సర్కారు దవాఖానల్లో 80 నుంచి 90 శాతం వరకు సాధారణ డెలివరీలు అవుతుండగా, ప్రైవేటు హాస్పిటళ్లలో మాత్రం 60 నుంచి 70 ఆపరేషన్లు జరుగుతున్నట్లు నివేదిక ఉందని చెప్పారు.

Also Read : భార‌త్‌-చైనా బోర్డ‌ర్ వివాదంపై ర‌గ‌డ : రాజ్య‌స‌భ వాయిదా

భవిష్యత్తులో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేటట్లు చూస్తామన్నారు.ప్రభుత్వ హాస్పిటళ్లలో చికిత్స బాగా అందిస్తూ.. పేదల పెన్నిధిగా మారాయని మంత్రి చెప్పారు. కేసీఆర్ కిట్ కింద ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన వారికి రూ.12 వేలు అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం లేదదన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube