ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలి..

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 06, మధిర:

ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని చెప్పి ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు ఈ ప్రభుత్వ విద్యార్థులను పట్టించుకోలేదని ఇక ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చెస్తామని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎంతోమందిని తీర్చిదిద్దిన ఈ కాలేజీ పరిస్థితి. వానొస్తే వలవలా గాలొస్తే గలగలా అన్న పరిస్థితి కనపడుతోంది. వెంటనే ప్రభుత్వ జూనియర్ కాలేజీ నూతన బిల్డింగ్ ఏర్పాటు చేయాలని, నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, బాత్ రూమ్స్ మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రతి విద్యార్థికి నెలకు వెయ్యి రూపాయలు పాకెట్ మనీ ప్రభుత్వం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

లేనిపక్షంలో విద్యార్థుల అంతా కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఎస్.ఎఫ్.ఐ జూనియర్ కాలేజ్ కమిటీ 15 మందితో అధ్యక్ష కార్యదర్శులుగా బ్లెస్సీ మోసెస్, భరత గల్స్ కన్వీనర్ గా పార్వతి ఉపాధ్యక్షురాలుగా కమల్ కుమార్, సహాయ కార్యదర్శి మణికంఠ ఎస్ ఎఫ్ ఐ కాలేజీ కమిటీ సభ్యులుగా వినోద్ కుమార్, చరణ్, అజయ్,యశ్వంత్, సాయి శరత్, రామ్, నరసింహా, మేఘనా, నిహారిక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube