ఆర్టిఐ చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం

0
TMedia (Telugu News) :

టీ మీడియా అక్టోబర్ 20 వనపర్తి : చట్టం తెలంగాణ ప్రభుత్వానికి చుట్టం అయింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆర్టిఐ సంరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్ తీవ్రంగా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. అవినీతి అధికారులకు అండగా ప్రభుత్వం ప్రోత్సహించడం సరైన మార్గం కాదు తెలంగాణ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని తెలుస్తుంది. తాజాగా సమాచారం కావాలంటే అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఏదైనా కార్యాలయం నుంచి సమాచారం కావాలని దరఖాస్తు చేసే ఆ సమాచారం ఇవ్వాలా వద్దా అనేది కార్యాలయం అధిపతి నిర్ణయిస్తాడు. అడిగిన సమాచారం ఇచ్చేందుకు ఇప్పటికే కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు. ఇంకా ఈ ఉత్తర్వులు వల్ల ప్రజల సమాచార హక్కు కోల్పోతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube