ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం ధ్యేయం

0
TMedia (Telugu News) :

ఏజెన్సీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ

బంగారు పినపాక ను తయారు చేస్తా:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

ఆభివృద్ది ,ప్రజల సమస్యల కోసం ముందుంటాం-ఎంపీ మాళోత్ కవిత

టీ మీడియా,డిసెంబర్ 26,కరకగూడెం:

పినపాక నియోజకవర్గంలో ఏజెన్సీ కరకగూడెం మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు,ఎంపీ కవిత తో కలిసి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
కరకగూడెం మండలంలోని చొప్పాల గ్రామంలో ముక్కోటి వాగు పై నిర్మించనున్న బ్రిడ్జి పనులకు రూ.2.58 కోట్ల రూపాయలతో,అదే విధంగా కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో మోతె గ్రామంలో రూ.4.50 కోట్లతో నిర్మించనున్న పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మోతె పాఠశాల నందు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ…ఏజెన్సీ అభివృద్ధి కోసం ప్రజల తరపున నిరంతరం కష్టపడే తత్వం రేగా కాంతారావు అని కొనియాడారు.

అనంతరం మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాళోత్ కవిత మాట్లాడుతూ…గ్రామాల అభివృద్ధి పనుల కోసం రేగా తరచూ ప్రతిపాదనలు తీసుకురావడమే కాక ప్రజల సమస్యల పరిష్కార కోసం పట్టుదలగా పని చేస్తాడాని ఆమె అన్నారు.

Government mission for public welfare

చివరగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ…బంగారు
పినపాక తయారు చేయడం కోసం నా జీవితం కళ ని,ఎన్నో ఏళ్ల నుండి ప్రజలు అనుభవిస్తున్న తమ బాధలను చూసి ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామీణ మూల ప్రాంతాల పనులను చకచకా చేయడంలో ముందుంటామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , జిల్లా కలెక్టర్ అనుదీప్ ,ఏఎస్పీ శబరీష్, పంచాయతీ రాజ్ సీఈ సీతారాములు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్,మండల ప్రజా ప్రతినిధులు,వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Government mission for public welfare
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube