విద్యారంగాన్ని గాలికి వదిలిన ప్రభుత్వం

విద్యారంగాన్ని గాలికి వదిలిన ప్రభుత్వం

1
TMedia (Telugu News) :

విద్యారంగాన్ని గాలికి వదిలిన ప్రభుత్వం

టీ మీడియా జులై 9 వనపర్తి బ్యూరో : ప్రభుత్వం కాపాడు కోవాల్సిన విద్యారంగాన్నీ పట్టిచుకోకుండా గాలికి వదిలేయడం సరికాదు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ,ఏకారుప దుస్తులు, ఇవ్వాలని,పాఠశాల లో మౌలిక సదుపాయాల కల్పించాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యు ఆధ్వర్యంలో పెబ్బేర్ ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్న నేటికీ పాఠ్యపుస్తకాలు , ఏకారుప దుస్తులు విద్యార్థులకు అందించకపోతే విద్యార్థుల చదువులు ముందుకు ఎలా సాగుతుంది.

 

Also Read : మంత్రి పువ్వాడ ను కలిసిన ఎస్పీ వినీత్

ప్రభుత్వ విద్యా సంస్థలను సమస్యల వలయంలోకి నెట్టి కార్పొరేట్ కి మేలు చేసే విధానాలు అమలు చేయడం అంటే ప్రభుత్వ విద్యను నాశనం చేయడమ కేజీ టు పీజీ ఉచిత విద్యా పథకాన్ని అమలు చేస్తామని ఎన్నికలు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీ అమలుకు పూనుకోకపోవడం అంటే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించకుండా మన ఊరు మన బడి పథకం పేరుతో కాలం గడపడమే ప్రైవైట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడి అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించాలి కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రిచాలి.ఖాళీగా ఉన్న టీచింగ్ , నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube