ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు

 

టీ మీడియా, నవంబర్ 2, వనపర్తి బ్యూరో : మునుగోడు నియోజకవర్గం ఉప ఎలక్షన్లో భాగంగా బిజెపి ప్రచారం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మునుగోడు మండల పలివెల గ్రామంలో ఈటెల జమున పుట్టినిల్లు ప్రచారం చేస్తుండగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి అనుచరులు టిఆర్ఎస్ నాయకులు విచక్షణ రహితంగా బిజెపి కార్యకర్తలపై రాళ్ల, కర్రలతో దాడులు చేసి, ప్రచార రథం, బిజెపి నాయకుల కార్లు ధ్వంసం చేయడం జరిగింది. ఈటల రాజేందర్ అనుచరులు బిజెపి కార్యకర్తలపై దాడులు చేయడంతో తీవ్ర గాయాలయ్యారు. దీని నిరసిస్తూ వనపర్తిలో బుధవారం రాజీవ్ చౌక్ నందు టిఆర్ఎస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.

Also Read : చిరు వ్యాపారులకి స్థలాన్ని కేటాయించాలి

ఎలక్షన్ కమిషన్ అధికారులు జోక్యం చేసుకొని పల్లా రాజేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తల దాడులు చేసిన వారి పైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కృష్ణ, ఉపాధ్యక్షులు కుమారస్వామి, జిల్లా ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, జిల్లా కార్యదర్శి పరశురాములు, సంస్థగత కార్యదర్శి బుడ్డన్న, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి సుగురు రాములు, రాయన్న విష్ణువర్ధన్ రెడ్డి, కరీం,ప్రవీణ్ జె పి వెంకట్,విక్రమ్,వెంకటేష్ నాయుడు ఓం ప్రకాష్ చారి బాబురావు,సుబ్రహ్మణ్యం బి.రాము పి.రాము,గజరాజుల తిరుమలేష్,జ్ఞానేశ్వర్ ,మహేష్,శివ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube