కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా సర్కార్ బడు

ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెంచటం అందరి బాధ్యత

0
TMedia (Telugu News) :

కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా సర్కార్ బడులు

ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం పెంచటం అందరి బాధ్యత

– జిల్లా మంత్రి పువ్వాడ

టీ మీడియా, ఫిబ్రవరి 25, అశ్వరావుపేట : నియోజవర్గంలోని అశ్వరావుపేట మండలంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం విస్తృత పర్యటన చేశారు ముఖ్యంగా మన ఊరు మన బడి కార్యక్రమములో భాగంగా అచ్యుతాపురం గ్రామంలో ప్రాథమిక పాఠశాలను 22లక్షల రూపాయల తో స్టూడెంట్స్ డేస్కేలు, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, బోర్డులు, స్కూలు ప్రహరీ లతో పాటు ఆధునీకరించిన వాటిని శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరావు తో కలసి ప్రారంభించారు. క్లాస్ రూమ్ లో చిన్నారులతో మాట్లాడుతూ ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో అనే విద్యార్థులని అడగగా చాలా బాగున్నాయి సార్ అని తెలుపుగా మీ స్నేహితులను కూడా అందరిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకోమని చెప్పండి మరి అని కొద్దిసేపు చిన్నారులతో కూర్చుని ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఇంగ్లీష్ అధ్యాపకులను పిల్లలు కొనియాడగా ఆయన్ని మీకు పిల్లలు మంచిగా మార్కులు వేశారని ప్రశంసించారు. ఇంకా బాగా చదువుకోవాలని మీకు ఏమి కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని పిల్లలకు భరోసా కల్పించారు.విద్యా బుద్దులు చెప్పడంలో ఉపాధ్యాయులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని అన్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను రాష్ట్రవ్యాప్తంగా మన ఊరు మన బడి పదకంలో ఆధునికరిస్తున్నామని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు. ఒకటో తరగతి నుండి మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ బోధన నిర్వహిస్తున్నామనితెలంగాణలో గురుకుల పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈరోజు గురుకుల పాఠశాలల వైపు చూస్తున్నారని జున్ నుండి సెప్టెంబర్ వరకు ఎంతో మంది విద్యార్థులు ఖాళీలు లేవని వస్తే ప్రతి వారం కూడా వారిని నీ చేర్పించుకోవల్సిందిగా అయా గురుకుల పాఠశాలలకు రికమండేషన్ చేస్తున్నానని అన్నారు.

Also Read : మంత్రి గెలుపు నల్లేరు మీద నడక

మరి ఈ విధంగా ప్రభుత్వ సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సర్కార్బడులలో హాజరు శాతం పెరిగే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేటి బాలలే రేపటి పౌరులని వారికి సరి అయిన విద్య అందిస్తే మీ ఊరు మీ జిల్లా ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి దశలో ముందుకు పోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు,డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్,కొత్తగూడెం జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు,మండల విద్యాశాఖ అధికారి కృషయ్య,స్థానిక ప్రజాప్రతినిధులు,భారాసా నాయకులు పాల్గొన్నా

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube