ప్రభుత్వ వెంటనే ధాన్యాన్ని కొనాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 25 వనపర్తి : రైతులు పండించే ధాన్యాన్ని ఎలాంటి నాణ్యత ప్రమాణాలు లెక్కచేయకుండా వెంటనే కొనాలని దేశానికి వెన్నెముక అయిన రైతుకు అండగా నిలవాలని ఏఐసిసి పిసిసి పిలుపుమేరకు జిల్లా కేంద్రాలలో గురువారం ధర్నా మరియు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజీవ్ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త కాపు శివసేన రెడ్డి, పిసిసి కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పిసిసి మెంబర్ శ్రీనివాస్గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, ఆయుబ్ ఖాన్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల పార్టీ నాయకులు పిసిసి నెంబర్స్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పార్టీ మండల అధ్యక్షులు కార్యదర్శులు యువజన నాయకులు కార్యకర్తలు అందరూ వెళ్లి కలెక్టర్ భవనం ముందు సమావేశమై ప్రసంగించిన తర్వాత కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన అధ్యక్షులు కిరణ్ కుమార్, చీరల జనార్ధన్, భాస్కర్, బాబా ,కౌన్సిలర్ బ్రహ్మం, రాధాకృష్ణ ,సత్యం, పెంటన్న తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube