ప్రైవేట్ ఉపాధ్యాయుల వృత్తికి ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలి

- స్వతంత్ర అభ్యర్థి దయానంద్

0
TMedia (Telugu News) :

ప్రైవేట్ ఉపాధ్యాయుల వృత్తికి ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలి

– స్వతంత్ర అభ్యర్థి దయానంద్

టీ మీడియా, డిసెంబర్ 29, వనపర్తి బ్యూరో : నూతన ప్రభుత్వంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యను పరిష్కారిoచాలని స్వతంత్ర అభ్యర్థి దయానంద్ తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలు మారడం లేదు. ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారు కాని వారు తరగతి గదికి పరిమితం అవుతున్నారు.చాలిచాలని జీతాలతో భావి భారత భవిష్యత్ ని సమాజానికి అందిస్తూ కుటుంబాలను నెట్టు కొస్తున్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులను మంజూరు చేయ్యాలి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు 12 నెలలతో కూడిన జీత భత్యాలు ఇవ్వాలి. సంక్షేమం బోర్డు లను సంక్షేమ భవనం ఏర్పాటు చెయ్యాలి. ప్రైవేటు టీచర్లకు హెల్త్ కార్డులు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈ.ఎస్ఐ ఈ.పీ.ఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. ప్రమాదశాతం ఉపాధ్యాయులు మరణిస్తే వారి పిల్లలకు ఉచిత విద్య అందించాలి పై సమస్యల దిశగా ప్రభుత్వం దృష్టిసాగించాలని కోరారు.

Also Read : కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ప్రభుత్వం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube