రైతుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

0
TMedia (Telugu News) :

తక్షణమే పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ఇచ్చి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు కట్టిపెట్టి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ఆపి వరి ధాన్యాన్ని కొంటామని రైతులకు భరోసా ఇవ్వాలి.

రైతుల బాధలు పట్టని కేసీఆర్&మోడీ

టీ మీడియా నవంబర్ 23: కొణిజర్ల

కొణిజర్ల మండల కేంద్రంలో నేడు టీపీసీసీ ఆదేశాల మేరకు రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొని రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ . ఈ విషయంపై తహశీల్దారకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి మండలం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ వడ్డే నారాయణ రావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య,పెద్దగోపతి ఎంపీటీసీ వడ్డె రమాదేవి, అమ్మపాలెం ఎంపిటిసి బానోతు అనూష, తుమ్మల పల్లి సర్పంచ్ రేణుక, పెద్దగోపతి సర్పంచ్ దానియేలు, భద్రయ్య , నండూరి నాగరాజు ,శ్రీనివాస రావు నాగేశ్వరరావు, బాంబే గుడివాడ వెంకటేశ్వర్లు ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వినుకొండ రాంబాబు తదితరులు పాల్గొన్న.

Central and state government should stop dramatising each other and assure farmers to buy paddy.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube