మత్స్యకారులకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు
– కలెక్టర్ వి.పి. గౌతమ్.
టి మీడియా,జులై2,ఖమ్మం:
జిల్లాలో నీలి విప్లవం క్రింద చేపల చెరువులు త్రవ్వుకునే కృషీవలులకు ప్రభుత్వం ప్రోత్సహకం అందిస్తుందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అక్వా కల్చర్ కమిటీ సమావేశంలో వ్యవసాయ, భూగర్భజల వనరుల, ఇర్రిగేషన్, మత్స్యశాఖలతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా చేపల చెరువల ఏర్పాటుకు సంబంధించి అందిన 32 దరఖాస్తులను కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలన తదుపరి 27 మంది లబ్ధిదారులకు చేపల చెరువులు త్రవ్వుకొనుటకు అమనుతి మంజూరు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులకు, మత్య కృషీవలులకు తగు సూచనలు చేసారు. జిల్లాలో మత్స్య సంపదను పెంపొందించేందుకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని, ప్రతి క్లస్టర్లో కనీసం ఒక చెరువు త్రవ్వుకునేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు.
Also Read : గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ లకు ఘన సన్మానం
అదేవిధంగా నీరు నిలువ ఉండే ప్రాంతాలలో నీటి ఉపరితల పరివాహక ప్రాంతాలను గుర్తించి. వాటి సమీప ప్రాంతాలలో ఉన్న రైతులను చేపల చెరువు త్రవ్వుకునే విధంగా ప్రోత్సహించాలని ఇర్రిగేషన్ అధికారులకు సూచించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్స్ ద్వారా నీటి లభ్యత పెరిగినందున వరి సాగు మాత్రమే కాకుండా క్రాఫ్ డైవర్షన్ ద్వారా చేపల చెరువులు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా అధిక లబ్ధిపొందవచ్చని సూచించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, జిల్లా ఇర్రిగేషన్ శాఖ అధికారి జి. సమ్మిరెడ్డి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి బి. శ్యాంప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి అంజనేయశాస్త్రి, వైరా ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు, ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, మధిర, సింగరేణి, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube