మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్27, మధిర:

మండలం లోని రైతులు వేసిన మిర్చి పంట పొలాలను సిపిఎం, బృందం పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, జిల్లా కమిటీ సభ్యులు శీలం నర్సింహారావు మాట్లాడుతూ…. మిర్చి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట విపరీతంగా నష్టపోయిందని నష్టపోయిన రైతులకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అదేవిధంగా మిర్చి పంటను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు అదనంగా ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున అందించాలన్నారు.

కౌలు రైతుల సమస్యలపరిష్కరించాలనీ కౌలు రైతులకు అదనంగా ఎకరానికి యాభై వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఏడు రాష్ర్టాల్లో కూడా ఇచ్చి పంట పూర్తిగా నష్టపోయినందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో రైతుల తరపున పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పడకంటి మురళి, రాధాకృష్ణ , పాపినేని రామనర్సయ్య పెంటి వెంకట్రావు ,శివయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube