ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్
టీ మీడియా, డిసెంబర్ 7, రామకృష్ణాపూర్ : చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన ముస్కె నిష్మ ఇటీవల నీట్ లో ర్యాంకు సాధించి హైదరాబాదులోని టి.ఆర్.ఆర్ మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.ఎస్ సీట్ సాధించింది. బుధవారం ప్రభుత్వ విప్,చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గడ్డెరగడి లోని ఆయన నివాసం లో విద్యార్థిని నిష్మ కు 50వేల రూపాయల సహాయం అందించారు. ఇప్పటి వరకు చెన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగ మెడికల్ సీటు సాధించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 11 మంది విద్యార్థులకు బాల్క సుమన్ ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్,కౌన్సిలర్ లు జాడి శ్రీనివాస్,పొగుల మల్లయ్య, గంగారపు సత్య పాల్,జక్కన బోయిన కుమార్ లు పాల్గొన్నారు.