టీ మీడియా,నవంబర్27,కరకగూడెం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరకగూడెం మండలంలోని కోర్నివెల్లి గ్రామానికి చెందిన పూనెం శంకరయ్య-నాగమణి దంపతుల ప్రథమ పుత్రుడు గౌతమ్-గౌతమి తో ఒకటవుతున్న సందర్భంగా వివాహ వేడుకకి హాజరయ్యారు.నూతన వధువరులకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,ప్రధాన కార్యదర్శి బుడగం రాము,యువజన విభాగం అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,ఆత్మ కమిటీ డైరక్టర్ కొంపెళ్ళి పెద్ద రామలింగం,రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ వట్టం వెంకటేశ్వర్లు,తెరాస మాజీ అధ్యక్షులు సారా సాంబయ్య,రేగా సత్యనారాయణ,మోకాళ్ల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.