పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రేవంత్‌

పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రేవంత్‌

0
TMedia (Telugu News) :

పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: రేవంత్‌

టీ మీడియా, డిసెంబర్ 26, హైదరాబాద్‌ : పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభంగా అందిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ”ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ అభివఅద్ధిని వేగవంతం చేస్తాం. కొంగర కలాన్‌ ఉత్పాదక కేంద్రానికి, పాక్స్‌కాన్‌ భవిష్యత్‌ ప్రాజెక్టులకు సహకారం అందిస్తాం” అని సీఎం తెలిపారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

Also Read : ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube