ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరగాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరగాలి

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరగాలి
టి మీడియా, మార్చి14,రాజోలి:

గర్భిణీ స్త్రీలు కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలో నే జరగాలని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్ తెలిపారు. మండల కేంద్రము లోని రాజోలి గ్రామంలో గర్భిణీ స్త్రీల ఇంటికీ తిరుగుతూ వారికి ప్రభుత్వ ప్రసవం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ గర్భిణీ స్త్రీలు కాన్పుకు ముందు టీ టీ లు రెండూ డోస్ లు తీసుకోవాలని, అలాగే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు కూడా వాడాలని ఆయన వివరించారు. ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. కాన్పు ఇంటిదగ్గర కాకుండా ప్రభుత్వ ఆసుపత్రి లోనే కాన్పు కావాలన్నారు. అప్పుడే తల్లీ బిడ్డా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కే సీ ఆర్ కిట్ తో పాటు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుంది అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రతీ గర్భిణీ స్త్రీలు ఉపయోగించుకొని ప్రభుత్వ ఆసుపత్రి లోనే కాన్పు కావాలని రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.

Also Read : శాంతియుత ఆందోళనలపై పోలీస్ నిర్బంధాలా.?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube