త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

టి మీడియా,ఏప్రిల్ 16,జగ్గయ్యపేట

1
TMedia (Telugu News) :

త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి -ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను

టి మీడియా,ఏప్రిల్ 16,జగ్గయ్యపేట: నియోజకవర్గం రావిరాల గ్రామంలో నవరత్నాలలో పేదలందరికీ ఇల్లులో భాగంగా ఈరోజు లబ్ధిదారులతో కలిసి ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను .ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలని,ఈ రోజుల్లో స్థలం కొనుగోలు చేసి ఇళ్ళు నిర్మించాలి అంటే కష్టసాధ్యమని అలాంటిది పేదల సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి గారు దీక్ష పూని ఎటువంటి రాజకీయాలకు తావులేకుండా నిస్వార్థంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయించడమే కాకుండా వారికి ఇంటి నిర్మాణం కోసం కావాల్సిన సదుపాయాలు అన్ని అందించడం జరుగుతుంది అని దాని దృష్టిలో ఉంచుకుని ఇళ్ళు మంజూరైన ప్రతి ఒక్కరూ త్వరతగతిన ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు,సర్పంచ్ లాహోరీ నరసింహారావు,వైస్ సర్పంచ్ రాజారావు,గ్రామపార్టీ అధ్యక్షులు నాగభూషణం,కోటేశ్వరరావు,గ్రామనయకులు యోహాను,తోట శ్రీను,బాణవతు పాండు తదితరులు పాల్గొన్నారు.

 

also read; నాలా కబ్జా దారుల పై చర్యలు తీసుకోండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube