పాలాభిషేకం చేసిన గౌడ సంఘం నేతలు
టీ మీడియా, డిసెంబర్ 2, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజు చౌక్ లో సీఎం కేసీఆర్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై సర్దార్ పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 360 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలోని అణగారిన వెనుకబడిన తరగతుల హక్కుల కోసం విరోచిత పోరాటం చేసి సంపన్నుల చేతిలో హతమైనటువంటి సర్వాయి సర్దార్ పాపన్న చరిత్ర గణనీయమైందని మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్న
Also Read : తెలంగాణలో అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడి
ఈ తరుణంలో పూర్వపు తెలంగాణ వీరుల చరిత్రను ఈ తరానికి అందించే విధంగా సర్దార్ పాపన్న త్యాగానికి ప్రతికగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కేసీఆర్ కే ఈ ఘనత దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం నేతలు శ్రీనివాస్ గౌడ్, రమేష్ గౌడ్, సురేష్ గౌడ్, కౌన్సిలర్ మధుసూదన్ గౌడ్, రామన్ గౌడ్, భగవంతుడు, పలుస శ్రీనివాస్ గౌడ్, కృపానంద గౌడ్ తదితరులు పాల్గొన్నారు.