ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్07, మధిర:
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని వామపక్షాల ఆధ్వర్యంలో మధిర,విజయవాడ రోడ్డు నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు పొన్నం
వెంకటేశ్వరరావు, బెజవాడ రవి ,మాట్లాడుతూ… రైతులు ఆరుగాలం పండించిన పంట పండించిన పంటను మార్కెట్కు తీసుకువచ్చి అమ్మకానికి చూపుతున్న ప్రభుత్వాలు మాత్రం కొనుగోలు చేయట్లేదని వాటిని వెంటనే కొనుగోలు చేయాలని ,ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తుల రాకుండా ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు . రైతులు పండించే మార్కెట్లో ఆరబోసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం లేదని ఇప్పటికే తుఫాన్ లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు శీలం నర్సింహారావు పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, మండల కార్యదర్శి మంద సైదులు, టౌన్ కమిటీ సభ్యులు పడకంటి మురళి, రాధాకృష్ణ , ప్రభాకర్, వెంకట్రావు,సిపిఐ మండల కార్యదర్శి ఓట్ల కొండా,మంగళగిరి రామాంజినేయులు, షేక్ కొండ,నాగేశ్వరరావు సిపిఎం సిపిఐ నాయకులు ,కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు .

Grain purchasing centers should be opened immediately.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube