పీసా సభకు విరుద్ధంగా జరిపిన గ్రామ సభ ఎన్నికను రద్దు చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 1, చర్ల :

చర్ల మండల కేంద్రంలో గల సంత ఆవర్ణలో పీసా గ్రామ సభ మేజర్ గ్రామ సర్పంచ్ కాపుల కృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సభలో ఎంపీపీ కోదండరామయ్య, జడ్పిటిసి శాంత పాల్గొన్నారు. ఓటర్ల శాతం ఎంతమంది వచ్చారో లెక్కిస్తుండగా,ఎంపీపీ కోదండ రామయ్య, జెడ్ పి టి సి శాంత సభ నుండి కొంత దూరం వెళ్లి సభకు వచ్చిన వారితో సంభాషిస్తుండగా, కోరం ఏర్పాటు చేయాల్సి ఉండగా ఓటర్ల సంఖ్య కోరంకి సరిపడా ఓటర్ల శాతం లేకుండా సర్పంచ్ కాపుల కృష్ణ అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.

ఈ క్రమంలో ఈవో కె కృష్ణ ఏ సంబంధం లేకుండా ఎన్నికకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఓటర్ల సంఖ్య గురించి ఎంపీపీ కోదండ రామయ్య అడిగినందుకు సర్పంచ్ కోదండ రామయ్యను దూషించడం లాంటివి చేసి, పీసా గ్రామ సభకు విరుద్ధంగా ఎన్నిక జరిపించారని, గ్రామ సభను ప్రకటించడం ఆపాలని, మేజర్ పంచాయతీకి జిల్లా కోఆర్డినేటర్ లేకుండా ఎన్నిక చేసారని, తాసిల్దార్ అనేక శాఖల అధికారులకు తెలియకుండా విరుద్ధంగా జరిగిన ఎన్నికను రద్దు చేయాలని తహసీల్దార్ ఈ నాగేశ్వరరావుకి వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శాంత ఎంపిటిసి కోదండరామయ్య సిపిఎం మండల కార్యదర్శి కొండా చరణ్, తాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Gram Sabha election against Pisa sabha should be canceled.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube