గ్రామకంఠం భూమి కాపాడాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 22 వనపర్తి: వనపర్తి పట్టణంలోని మరేమ్మకుంట దగ్గర గ్రామకంఠం భూమి కబ్జాదారుల పై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ నడిబొడ్డున మరేమ్మకుంట సమీపంలో సర్వే నెంబర్ 1064 లో 5 గంటల గ్రామకంఠం భూమి ఉందని ప్రభుత్వం గుర్తించింది ఈ భూమిని 2007లో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం పెట్టాలని తీర్మానం చేశారు. కానీ టిఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు చేయించి కబ్జా చేయాలని చూస్తున్నారు. కొంతమందిని ముందర నుంచి ఊరు పేరు లేని వ్యక్తుల పేరిట ఎటువంటి అనుమతులు లేకుండా మంచినీళ్లు బోరు వేయడం జరిగింది. ఇట్టి భూమిని కాపాడాలని అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జేసీ గారికి వినతి పత్రం అందజేసిన అనంతరం భూమిని పరిశీలించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గంధం నాగరాజు, టిడిపి పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్, ఆంజనేయులు, కురుమయ్య, మదన్,చంద్రయ్య, కురుమన్న, చిరంజీవి, రాజు,ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొని మాట్లాడారు.

Gramakantham land near Maremmakunta in Vanaparthi town.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube