ఘనంగా టీబీజికెఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జెండా ఆవిష్కరిచిన బిఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి

0
TMedia (Telugu News) :

ఘనంగా టీబీజికెఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జెండా ఆవిష్కరిచిన బిఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి

టి మీడియా,జనవరి 27,గోదావరిఖని : ఆర్జీ-2 పరిధిలోని ఓసిపి-3 కృషిభవన్,బేస్ వర్క్ షాప్ లలో టీబీజీకేఎస్ నాయకులు శుక్రవారం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి ఆహ్వనించగా, కార్యక్రమంలో పాల్గోని జెండా ను అవిష్కరించడం జరిగింది.ఈ సంధర్బంగా సంధ్యారాణి మాట్లాడుతూ..తెలంగాణ బోగ్గు గని కార్మిక సంఘం ఎర్పడి 20 సంవత్సరములు పూర్తి చేసుకొని 21 వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణిలో అహర్నిశలూ శ్రమిస్తూ, దేశానికి వెలుగులు పంచుతున్న బొగ్గు గని కార్మిక సోదరులకు ఈ సందర్బంగా టీబీజీకేఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే టీబీజీకేఎస్ ను ఆదరిస్తున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు.కార్మికుల శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం ఎన్నడూ లేని విధంగా 60కి పైగా హక్కులను టీబీజీకేఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నేత్రుత్వంలో సాధించడం జరిగిందన్నారు.కార్మిక సంక్షేమమే దేయంగా మన ముఖ్యమంత్రి కెసిఆర్ కార్మికులకు అండగా ఉంటూ సింగరేణి సంస్థను అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు.

Also Read : ఘనంగా టి.బి.జి.కె.ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అనంతరం కార్మికులకు నూతన సంవత్సర క్యాలెండర్స్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో లెవన్ మెన్ కమిటి మెంబర్ కొత్త సత్యనారాయణ రెడ్డి,పిట్ సెక్రేటరీ కొంగర రవిందర్,బ్రాంచ్ సెక్రటరీ సిరంగి శ్రీనివాస్,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ జగన్ బాబు,అసిస్టెంట్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి,ఎల్కలపెల్లి సదయ్య,ఎస్ రాములు,బి.నర్సయ్య,ఐలయ్య,వాహేద్,భీముని సత్యనారాయణ,బి.వి రమణ,విజయ్,సింగరేణి కార్మికులు పాల్గోన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube