గ్రంధాలయంకు రు 1.50కొట్లు మంజూరు

దాతల సహకారం అద్భుతం

1
TMedia (Telugu News) :

గ్రంధాలయంకు రు 1.50కొట్లు మంజూరు
-దాతల సహకారం అద్భుతం

కలెక్టర్ అనుదీప్

టి మీడియా, జూన్ 27,భద్రాద్రి కొత్తగూడెం:

జిల్లా కేంద్రంలో గ్రంధాలయ నిర్మాణానికి 1.50 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కేంద్ర గ్రంధాలయంలో ప్రవాస భారతీయులు 80 వేలు, పేరయ్య 40 వేలు, బసవయ్య 25 వేలు, డాక్టర్ రవికుమార్ 20 వేలు, మిర్యాల మోహన్ రావు, సీనియర్ ఆడిటర్ మమత 20 వేలు అందచేసిన విరాళంతో విద్యార్థుల సౌకర్యం ఏర్పాటు చేసిన ఫర్నీచర్, కుర్చీలు, వాటర్ కూలర్లు, లోకల్ ఫండ్ కార్యాలయం నుండి 10 వేల రూపాయల విలువ చేసే పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోటీ పరీక్షలనకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, ఫర్నీచర్ అందచేయడం పదాలను అభినందించారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పనకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. గ్రంధాలయంలో వేలాడే విద్యుత్ లైట్లు ఏర్పాటుతో పాటు గ్రంధాలయ పరిసరాలు, ర్యాంప్ ఏర్పాటు, ఆహ్లాదకరంగా తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Also Read : గజ్వేల్‌కు గూడ్స్‌ రైలు రాకపోకలు ప్రారంభం

 

విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ విద్యార్ధులకు పంపిణీ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నందున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. మన జిల్లా యువత పెద్ద ఎత్తున ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. జిల్లా నూతనంగా ఏర్పడిన నాటి నుండి అన్ని రంగాలలో పోటీపడుతున్నామని చెప్పారు. మన జిల్లాలో మంచి గ్రంధాలయం ఉండాలని గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ కోరియున్నారని, వారి కోరిక మేరకు 1.50 సిఎస్ఆర్ నిధులతో ఆధునాతన సౌకర్యాలతో గ్రంథాలయం ఏర్పాటు చేయుటకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. గతంలో తాను వచ్చినపుడు విద్యార్థులు గ్రంధాలయంతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరియున్నారని చెప్పారు.

 

Also Read : పాజిటివ్‌ కేసులు మళ్లీ 17 వేలు దాటాయి

జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. గ్రంధాలయంతో ర్యాకులు కూడా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఒత్తిడి లేకుండా చక్కటి కార్యాచరణ ప్రణాళికలతో రోజు రోజుకు మెరుగుపడుతూ ముందుకు పోతే తప్పక పరీక్షల్లో విజయం సాధిస్తారని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, సంస్థ కార్యదర్శి కాలంగి కరుణకుమారి,బాబు బయ్యన, ఇల్లందుకు చెందిన పేరయ్య, బసవయ్య, డాక్టర్ రవికుమార్, మిరియాల మోహన్, మున్సిపల్కమిషనర్ నవీన్, తహసిల్దార్ రామక్రిష్ణ, సంస్థ డైరెక్టర్ మోరే భాస్కర్, సిబ్బంది నవీన కుమార్, డి వరలక్ష్మి, మణిమృదుల,మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube