క్రీడాకారిణి నందినికి ఘన సన్మానం

క్రీడాకారిణి నందినికి ఘన సన్మానం

0
TMedia (Telugu News) :

క్రీడాకారిణి నందినికి ఘన సన్మానం

టీ మీడియా, జనవరి 4, పెబ్బేరు: ఉమ్మడి పెబ్బేరు మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన కొండయ్య భాగ్యమ్మ దంపతులకు జన్మించిన నందిని కబడ్డీ పోటీలలో రాష్ట్రస్థాయికి ఎంపికైంది. గత సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అండర్ 17 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నందిని రాష్ట్రస్థాయికి ఎంపికైంది. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నందిని విద్యనభ్యసిస్తున్న మాంటిసోరి స్కూల్ వద్దకు చేరుకుని ఆ విద్యార్థిని శాలువ పూలమాలతో సత్కరించారు.

Also Read : ఉచిత విద్యుత్ పథకం కొనసాగుతుంది

క్రీడాకారిణి నందినికి గురువైన పీఈటి మహేష్ యాదవ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మాలపల్లి‌, సురేందర్ గౌడ్, వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube