నిరుద్యోగుల బంధు- కేసీఆర్
– గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు
-చింత నిప్పు కృష్ణ వ్చైతన్య
టీ మీడియా,మార్చి 11,ఖమ్మం : నగరం లోని గ్రంథాలయంలో
నిరుద్యోగ యువత ముఖ్యమంత్రి కెసిఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి “కేసీఆర్* గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు మరియు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయటం హర్షణీయమని,
తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించనున్నాయి అని, తద్వారా వారి కల సాకారం కాబోతుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, హైదరాబాద్ అభివృద్ధి చూసి పెద్ద పెద్ద కంపెనీలు పరిశ్రమలు హైదరాబాద్ తరలి వస్తున్నాయని తద్వారా ప్రైవేటు రంగాల్లో కూడా పుష్కలంగా ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని,
Also Read : సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
కెసిఆర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగుల గతంలో కూడా క్రమబద్ధీకరించారని, ప్రస్తుతం కూడా 11 వేల మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయడం జరిగిందని,
నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించడం లో తమ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలని, అన్ని విధాలుగా అండదండలుగా ఉన్నా ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని, కష్ట
పడి చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రంధాలయ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత విద్యార్థులు యువకులు పాల్గొన్నారు.