గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు వెళ్లేవారికి నిబంధనలు ఇవే..!

గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు వెళ్లేవారికి నిబంధనలు ఇవే..!

0
TMedia (Telugu News) :

గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు వెళ్లేవారికి నిబంధనలు ఇవే..!

టి మీడియా,అక్టోబర్ 15,హైదరాబాద్‌: గ్రూప్​ –1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా కీలక దశ మొదలైంది. ఈ నెల 16న ప్రిలిమ్స్​పరీక్షను నిర్వహిస్తున్నారు. దీనికోసం టీఎస్​ పీఎస్సీ పక్కా ఏర్పాట్లు చేస్తోంది. బయో మెట్రిక్​విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే, పరీక్షా కేంద్రాల్లోకి షూస్‌తో రాకుడదని ఆంక్షలు విధించింది. మెహందీ, టాటూ వంటి అలంకరణతో వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఈ విషయాన్ని నిబంధనల్లో స్పష్టం చేసింది. 900 మార్కులతో నిర్వహించే గ్రూప్​ –1 పరీక్షల్లో భాగంగా ప్రాథమిక పరీక్ష నుంచే నిబంధనలను కఠినతరం చేశారు. ఈసారి ఇంటర్వ్యూలను ఎత్తివేయడంతో కేవలం రాత పరీక్ష ఆధారంగానే ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షకు సంబంధించిన కొన్ని నియమనిబంధనలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్‌-1 లో మొత్తం 503 పోస్టులకు 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

 

Also Read :మలబార్ జెమ్స్ రూ. 750 కోట్ల పెట్టుబడులు

ఒకరి బదులు ఒకరు వస్తే శాశ్వతంగా డిబార్​

గ్రూప్​–1 పరీక్షకు ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరైతే వారిని శాశ్వతకాలం డీబార్‌ చేయనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా వారు ఎలాంటి గ్రూప్స్​పరీక్షలకు కూడా అనర్హులుగా ఉంటారు. ఈ నెల 16 ఉదయం 10.30 గంటల నుంచి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుండగా, పరీక్ష సమయానికి పావుగంట ముందే పరీక్షా కేంద్రం గేట్‌ క్లోజ్‌ చేస్తారు. అంటే.. 10.15 తర్వాత పరీక్షాకేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని టీఎస్పీఎస్సీ చెప్పింది. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. అలాగే పరీక్ష ముసిగే వరకు లోపలి వాళ్లు బయటకు వెళ్లే వీలు ఉండదు. ఎగ్జామ్స్​ హాల్‌లోకి బూట్లు వేసుకుని వస్తే అనుమతి లేదు. అభ్యర్థులు చెప్పులతోనే మాత్రమే హాజరుకావాలి. మెహిందీ, టాటూలు వంటివి కాళ్లు, చేతులపై అలంకరించుకొని రావద్దని స్పష్టం చేశారు.

 

బెల్లంపల్లి లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలి

 

ఇక, ఓఎంఆర్‌ ఫిల్ చేసేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కమిషన్‌ తెలిపింది. ఓఎంఆర్‌ షీట్‌లో వైట్‌నర్‌, చాక్‌పౌడర్‌, ఎరైజర్‌, బ్లేడు వంటివి ఉపయోగిస్తే ఆ జవాబు పత్రాన్ని డిస్‌క్వాలిఫైగా పరిగణించనున్నట్టు పేర్కొన్నారు. బుక్‌లెట్‌ సిరీస్‌ నంబర్‌ ఓఎంఆర్‌లో సరిగా నింపాలని, సిరీస్‌ సరిగా రాసి, వృత్తాల్ని నిబంధనల ప్రకారం నింపకుంటే ఆ ఓఎంఆర్‌ను డిస్‌క్వాలిఫై చేస్తామని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకున్న తర్వాత మాత్రమే ప్రిలిమినరీ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్స్‌ పరీక్షకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రిలిమ్స్‌ బయోమెట్రిక్‌తో సరిపోతేనే మెయిన్స్‌ పరీక్ష రాసే అవకాశం ఉంటుందని తెలిపారు.

టెస్ట్ బుక్‌లెట్ నంబర్ టెస్ట్ బుక్‌లెట్ కవర్ పేజీ యొక్క కుడి మూలలో ముద్రించబడుతుందని, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో తగిన సర్కిల్‌లను డార్క్ చేయడం ద్వారా ఓఎంఆర్​ఆన్సర్ షీట్‌లోని 1వ వైపు టెస్ట్ బుక్‌లెట్ నంబర్‌ను మార్క్ చేయాలని, టెస్ట్ బుక్‌లెట్ నంబర్‌ను పూరించడానికి ఉదాహరించారు. అభ్యర్థి టెస్ట్ బుక్‌లెట్ నంబర్ 102365 అయితే, ఓఎంఆర్​ జవాబు పత్రం యొక్క 1వ వైపున ఉన్న టెస్ట్ బుక్‌లెట్ నంబర్‌ను బ్లాక్‌గా మార్చకుంటే జవాబు పత్రం తదుపరి నోటీసు లేకుండా చెల్లదని, ఖచ్చితమైన టెస్ట్ బుక్‌లెట్ సంఖ్యను నిర్ణయించడంలో వ్యత్యాసానికి దారితీసే విధంగా అది బ్లాక్‌గా ఉంటే, తప్పు ఫలితం / సమాధాన పత్రం తిరస్కరణకు దారితీయవచ్చని, దానికి అభ్యర్థి స్వయంగా బాధ్యత వహిస్తారని స్పష్టం చేసింది.

రాష్ట్రం దాటుతున్న రేషన్ బియ్యం

కాలిక్యులేటర్లు, లాగ్‌ బుక్‌లు, పేజర్, సెల్ ఫోన్‌లు, టాబ్లెట్, పెన్​డ్రైవ్, బ్లూటూత్​ పరికరాలు, వాచ్, లాగ్​టేబుల్‌లు, వాలెట్, హ్యాండ్​ బ్యాగులు, రైటింగ్​ప్యాడ్​, నోట్స, చార్జ్​ లు, లూజ్​ షీట్స్​ వంటివి అనుమతించమని టీఎస్​పీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు కమ్యూనికేట్ చేయడం, సంప్రదింపులు జరపడం, ఇతర అభ్యర్థులతో సంభాషించడం లేదా పరీక్షా హాలులో మరియు చుట్టుపక్కల నినాదాలు చేయడం, పరీక్ష సమయంలో ఏ విధంగానైనా భంగం కలిగించడం వంటి ఆందోళన వ్యూహాలను అనుసరించడం వంటి వాటిని నిషేధిస్తున్నట్లు టీఎస్​ పీఎస్సీ ప్రకటించింది.

గుర్తింపు కార్డు మస్ట్​

ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌తోపాటు పాస్‌పోర్టు, పాన్‌, ఓటరు, ఆధార్‌ కార్డు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డు తీసుకురావాలని కమిషన్‌ సూచించింది. అభ్యర్థులు హాల్‌ టికెట్లను ఏ4 సైజులో ప్రింట్‌ తీసుకుని రావాలని, కలర్​ ఫ్రింట్​అయితే ఇంకా బెటర్​అని, ఓఎంఆర్‌ పత్రంపై అభ్యర్థితోపాటు ఇన్విజిలేటర్‌ సంతకాలు ఉండాలని, ఒకవేళ ఫొటో, సంతకం ఏదైనా హాల్‌టికెట్‌పై ప్రింట్‌ కాకపోతే గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ పత్రం తీసుకుని రావాలని సూచించింది. అందుకే అభ్యర్థులు చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా త్వరగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube