పకడ్బందీగా గ్రూప్1 పరీక్షలు

పకడ్బందీగా గ్రూప్1 పరీక్షలు

1
TMedia (Telugu News) :

పకడ్బందీగా గ్రూప్1 పరీక్షలు

– కలెక్టర్ విపి గౌతం

టీ మీడియా,అక్టోబర్ 10,ఖమ్మం, : 16 న నిర్వహించే గ్రూప్-1 పరీక్షను ప్రశాంతంగా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో టిఎస్ పీఎస్ సి ద్వారా నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్ష ఏర్పాట్లపై అధికారులు, లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులతో పాటు పరీక్షలు జరుగనున్న కళాశాలల ప్రిన్సిపాళ్లతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాలను లైజనింగ్ అధికారులు పరిశీలించాలని, సౌకర్యాలు, ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్లు తదితర నియామక ఏర్పాట్లు జరిగాయా చూడాలని అన్నారు. కేంద్రాలలో సిసి కెమరాలను ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాలను పంపిణి మొత్తం సిసి కెమరాల ద్వారా చేపట్టాలని, కెమరాలు లేని చోట వీడియో కెమరాల ద్వారా రికార్డు చేయాలని అన్నారు. పరీక్షకేంద్రాల వద్ద అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని, వీరితో పాటు ఫ్లయింగ్ స్క్వార్డ్ టీంను కెమేరాతో పాటుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ALSO READ :స్మశాన వాటికకు దారి కనబడడం లేదు

పరీక్షలకు వచ్చే వికలాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా ర్యాంపు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, మొదటి అంతస్థులో ఎగ్జామ్ ఉన్నట్లయితే వారికి గ్రౌండ్ ఫ్లోర్ లో పరీక్షకు అనుమతించేలా చూడాలని, పరీక్షా కేంద్రం వద్ద ఎవరికి ఏ రూంలో పరీక్షను నిర్వహించేది తెలిపేలా రూట్ మ్యాప్ తో డీస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని, టాయిలెట్స్, త్రాగునీరు తదితరాలకు సూచిక బోర్డులు పెట్టాలని అన్నారు. అదేవిధంగా ప్రతి పరీక్షా కేంద్రంవద్ద మంచినీరు, టాయిలెట్లు సక్రమంగా ఉండేలా చూడాలని, ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ముందుగానే సరిచూసుకోవాలని అన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఒక రోజు ముందుగానే సందర్శించి అవగాహనకు రావాలని ఆయన తెలిపారు. అభ్యర్థులు ఉ. 8.30 నిమిషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఉ. 10.15 నిమిషాలకు పరీక్షా కేంద్రం గేట్ మూసివేస్తారని ఆయన అన్నారు.

 

ALSO READ :రావినూతల లో పర్యటించిన, ఎంపీ నామ

హాల్ టికెట్ తోపాటు ఏదేని ఒక ధ్రువీకరణ పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ కార్డ్, ఉద్యోగి అయితే ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాల్లో ఒకటి ఒరిజినల్ వెంట తేవాలన్నారు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే తొడగాలని ఆయన తెలిపారు. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోనే ఓఎంఆర్ షీట్ లో పూరించాలని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రాలకు రైటింగ్ ప్యాడ్, వాలెట్, వాచ్, మొబైల్ ఫోన్, ట్యాబ్ లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూ టూత్, కాలిక్యులేటర్స్ ఏటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల అనుమతి లేదన్నారు. అభ్యర్థులు వీటిని పరీక్షా కేంద్రాలకు వెంట తేవద్దని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులను షూస్ తో అనుమతించారని ఆయన అన్నారు. బయోమెట్రిక్ ద్వారా హాజరు ఉంటుంది కాబట్టి, అభ్యర్థులు మెహేంది, ఇంక్, టాటూ లు చేతులకు పెట్టుకోవద్దని కలెక్టర్ సూచించారు. ఓఎంఆర్ షీట్ల పూరణకు పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ లు వాడవద్దని ఆయన అన్నారు. వైట్ నర్, చాక్ పౌడర్, బ్లెడ్, రబ్బరు లను ఓఎంఆర్ షీట్లపై అప్లై చేయకూడదన్నారు. హాల్ టికెట్లపై ఉన్న సూచనలు చదువుకొని పూర్తి అవగాహనకు రావాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తామని ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహించే అనుభవం ఇప్పటికే ఉన్న ప్రతి పరీక్ష క్రొత్తగా చేస్తున్నట్లు జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగిన దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఎక్కడా పొరపాటుకు అవకాశం లేకుండా, వ్యక్తిగత శ్రద్ధ తో విజయవంతంగా చేపట్టాలని కలెక్టర్ అన్నారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, అదనపు డిసిపి డా. షబరీష్, డిఆర్వో శిరీష, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా అధికారులు, లైజనింగ్ అధికారులు, అసిస్టెంట్ లైజనింగ్ అధికారులు, పరీక్షాకేంద్రాల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube