లాండ్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు

0
TMedia (Telugu News) :

జి ఎస్ పి ఆరోపణ

టి మీడియా, డిసెంబర్ 11, చర్ల :
చర్ల మండల పరిధిలోగల సుబ్బంపేట గ్రామంలో వాసం ముసలయ్య అధ్యక్షత శనివారం జి ఎస్ పి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ.. భద్రాచల కేంద్రంలో ఎల్ టి ఆర్ 1/70 చట్టమును ఐటీడీఏ అధికారులు రక్షించాల్సిన ప్రభుత్వ ఆస్తులను రక్షించుకుండా, ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపారని ఆరోపించారు. భద్రాచలం కేంద్రంగా ఉన్నటువంటి గిరిజన అభివృద్ధి స్థలం ఉన్నట్టా ? లేనట్టా ? అని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఐటిడిఏ జి ఎస్ పి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి కల్లూరి కిషోర్, కుర్సం రాంబాబు, కాక ఎల్లేశ్వరరావు, కాక సాంబేశ్వరరావు, కణితి శ్రీనివాసరావు, వాసం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube