పేదల పైన జీఎస్టీ భారం ఏంటి

పన్ను తక్షణమే ఎత్తి వేయండి

1
TMedia (Telugu News) :

పేదల పైన జీఎస్టీ భారం ఏంటి

-పన్ను తక్షణమే ఎత్తి వేయండి

-లోక్ సభ లో ఎంపీ నామా నాగేశ్వరరావు

టి మీడియా,జూలై26,ఢిల్లీ : రోజు కాయకష్టం చేసుకొని జీవించే పేదల పైన జీఎస్టీ భారం వేయటం ఏమిటని టీఆర్ఎన్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తక్షణమే వ్యవసాయ ఉత్పత్తులు, వస్త్రాలు, పాదరక్షలు ఉత్పత్తులు పైన వేసిన పన్ను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీ నామ కేంద్రానికి లిఖిత పూర్వకంగా ప్రశ్న వేశారు. జీఎస్టీ పన్ను పోటు వల్ల కోట్లాది మంది పేదలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలు, పాలు సంబంధిత ఆహార పదార్థాలు , ఉప్పు , పప్పు , కూరగాయాలపైనా జీఎస్టీ విధించడం దారుణమన్నారు . పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వస్తు, సేవల పన్ను భారాన్ని (జీఎస్టీ) తొలగించేందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకున్నదా ? తీసుకుంటే అవేమిటో తెలియజేయాలని కేంద్ర మంత్రిని కోరారు . వ్యవసాయం, వస్త్రం, పాదరక్షలు, తదితర వాటిపై జీఎస్టీ పన్నుల భారం ఎక్కువుగా మోపడం వల్ల పేద ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

 

Also Read : సిపిఐ జిల్లా కార్యదర్శిగా రామడుగు లక్ష్మణ్ ఎన్నిక

పన్నుల భారాలను తగ్గించేందుకు కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదించిందా ? అయితే వాటి వివరాలను తెలియజేయాలని నామ కోరారు . నామ ప్రశ్నపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సిఫార్స్ మేరకు జీఎస్టీ రేట్లు నిర్దేశించారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు . వ్యవసాయ ఉత్పత్తులు, పేదలు వినియోగించే వస్త్రాలు, పాదరక్షలు వంటి వస్తువులు మినహాయించడం లేదా 5 నుంచి 12 శాతం రేటుతో జీఎస్టీని వర్తింప చేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube