చేనేత కార్మికుల పై జిఎస్టీ ఎత్తి వేయాలి

- వాకిటి శ్రీధర్ మున్సిపల్ వైస్ చైర్మన్

2
TMedia (Telugu News) :

చేనేత కార్మికుల పై జిఎస్టీ ఎత్తి వేయాలి

 

– ప్రధాని మోడీకి పోస్టుకార్డు

 

– వాకిటి శ్రీధర్ మున్సిపల్ వైస్ చైర్మన్

టీ మీడియా, అక్టోబర్ 25, వనపర్తి బ్యూరో : చేనేత కార్మికులపై పెంచిన జిఎస్టీ తక్షణమే ఎత్తి వేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కేంద్ర ప్రభుత్వంను డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ ఛాంబర్లో చేనేత కార్మికులపై 5 శాతం ఉన్న జిఎస్టీని 12 శాతం పెంచినందుకు గాను నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు పోస్ట్ కార్డ్ రాసి తన నిరసనను వ్యక్తం చేశారు.

Also Read : కబడ్డీ పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

దేశంలో వ్యవసాయ రంగం తరువాత ఉన్న చేనేత రంగం అని అలాంటి రంగం పై జిఎస్టీ పెంపు చేస్తే దేశ వ్యాప్తంగా గల పేద, బడుగు బలహీన వర్గాలు, మధ్య తరగతి ప్రజలకు పెను భారం పడుతుందని వెంటనే జిఎస్టీ ను రద్దు చేయాలని ఆయన పోస్టుకార్డులో పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube