శవరాజకీయాలకు స్వస్తిపలకండి

శవరాజకీయాలకు స్వస్తిపలకండి

1
TMedia (Telugu News) :

శవరాజకీయాలకు స్వస్తిపలకండి
టీ మీడియా,ఏప్రిల్ 21,ఖమ్మం : చైతన్యవంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు మతోన్మాద రాజకీయాలకు తావివ్వవద్దని సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బాగం హేమంతరావు విజ్ఞప్తిచేశారు . బీజేపీ దాని అనుబంధ సంస్థలు మతం సాక్షిగా ఖమ్మం జిల్లా రాజకీయాలను కలుషితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక వ్యక్తి ఆత్మహత్యను అడ్డుగా పెట్టుకొని రాజకీయ లబ్దిపొందేందుకు ప్రయతినస్తున్నాయన్నారు . బుధవారం స్థానిక సి.పి.ఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శిపోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ పోలీసు స్టేషన్లో ఆత్మహత్య జరిగినా పోలీసులు వేధించినా భారతకమ్యూనిస్టు పార్టీ సహించదని బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని సి.పి.ఐ డిమాండ్ చేస్తున్నదన్నారు.

Also Read : కార్బైడ్ రహిత మామిడి పండ్ల మేళా ను ప్రారంభించిన మేయర్

అతని ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడి చేయాలన్నారు. ఒక ఆత్మహత్యను సాకుగా చూపి లబ్ది పొందే ప్రయత్నాలను సి.పి.ఐ ఖండిస్తున్నదన్నారు. పాలకులు ప్రజలను విస్మరించి పాలన సాగిస్తున్నారని ఆయన తెలిపారు. ఖమ్మంజిల్లా గడ్డ పైన మతంసాక్షిగా బలపడాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని అందుకే శవ , నీచ రాజకీయాలకు తెరలేపిందన్నారు . ఖమ్మంజిల్లా ప్రజలు చైతన్య శీలురని బీజేపీ కుట్ర రాజకీయాలను అర్ధం చేసుకుంటారని హేమంతరావు తెలిపారు . ఈ సమావేశంలో సి.పి.ఐ. జిల్లా కార్యవర్గసభ్యులు ఎస్.కె.జానిమియా , బి.జి. క్లెమెంట్ , మహ్మద్ సలాం , తాటివెంకటేశ్వరరావు , పోటు కళావతి , సి.హెచ్ సీతామహాలక్ష్మి , ఏపూరి లతాదేవి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube