గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

1
TMedia (Telugu News) :

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

టీ మీడియా,నవంబర్ 3,డిల్లి : గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు.గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
దేశంలోనే తొలిసారిగా షిప్పింగ్ కంటైనర్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. బారుచ్ జిల్లా అలియాబెట్లో ఉన్న 217 మంది ఓటర్ల కోసం ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Also Read : ఆలయమునకు విరాళం అందించిన దాతలు

వీరు ఓటు వేయాలంటే దాదాపు 82 కి.మీ. ప్రయాణించాల్సి ఉండేది. కానీ ఇప్పుడా ఇబ్బందులు ఉండవు.
గిర్ సోమనాథ్ జిల్లాలోని మాదాపూర్ జంబూర్లో సిద్దీల కోసం 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు 14-17వ శతాబ్దం మధ్య కాలంలో తూర్పు ఆఫ్రికా నుంచి గుజరాతువచ్చారు.గుజరాత్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధాని పోటీ బీజేపీ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube