గులాబి లీడర్ల గోల్ మాల్

దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ లు, రెగ్యులైజేషన్ దందా లు

0
TMedia (Telugu News) :

గులాబి లీడర్ల గోల్ మాల్

-దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ లు, రెగ్యులైజేషన్ దందా లు

-ఓక్కోకటి బైటకు

-ఇచ్చిన అడ్వాన్స్ ల కోసం బాధితుల ప్రదక్షిణలు

టి మీడియా, డిసెంబర్ 23, ఖమ్మం బ్యూరో : గత ప్రభుత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు పథకాలు అందేలా చేస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. దళితబంధుకు రూ.2లక్షలు, బీసీ బంధుకు రూ.20 నుంచి 30వేలు, డబుల్‌ బెడ్‌రూం ఇంటికి రూ.1.50,గృహాలక్ష్మి కి రూ 50 వేళ రూపాయల చొప్పున చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కాంట్రాక్టు ప్రాతిపాదికన ఉద్యోగాలు పెట్టిస్తామని కూడా డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది. ఇవి కాక 58,59క్రింద రెగ్యులైజేషన్ పేరుతో, వెంచర్లు కు అనుమతులు,ఆసరా పింఛన్ అంటూ వసూళ్లు ఒక్కొక టి బైటకు వస్తున్న యి. అశ్వారావుపేట మొదలు పాలేరు నియోజకవర్గం వరకుఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటువంటి వి ఉన్నాయి.అడ్వాన్స్ లు ఇచ్చిన బాధితులు వెంటపడటం తో కొంతమంది నే(మే )తలు అడ్రెస్ లేరు. పోలీస్ లు ను బాధితులు పిర్యాదు చేసే పని లో ఉన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులు ప్రదర్శించిన చేతివాటం ఇప్పుడు వారిని ఇరుకున పడేసింది. ప్రభుత్వం మారడంతో దళితబంధు, బీసీబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గృహ లక్ష్మి వంటి పథకాలకు బ్రేక్ పడింది. దీంతో ఎంతో ఆశతో దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. స్కీం సంగతి అటుంచితే తాము ముట్టజెప్పిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వారు బీఆర్ఎస్ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Also Read : పిఎంపి, ఆర్ఎంపీ ల సమస్యలు పరిష్కరించండి

ఒకొక్కటిగా బయటకు..

బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది లీడర్ల బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆయా పథకాల్లో లబ్ధి చేకూర్చుతామంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురు కిందిస్థాయి నేతలు డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. తీరా ప్రభుత్వం మారడంతో చేతులు ఎత్తేశారని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని ముఖం చాటేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ముడుపులు ముట్టజెప్పిన వారు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube