నేతకానీలకు పోడు హక్కులు కల్పించాలి:సుదర్శన్

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్10,పినపాక:

పినపాక మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీలో పూర్వ నుండి నివసిస్తున్న నేతకానీలు గుమాసు సుదర్శన్ అధ్యక్షతన పంచాయితీ సెక్రెటరీ పి. సాయి కృష్ణ,మల్లారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి. రవిందర్ లకు మర్యాద పూర్వకంగా కలిశారు.
మల్లారం గ్రామ పంచాయతీలో ఉంటున్న నేతకానీలకు పోడు హక్కులు కల్పించాలని వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్బంగా గుమాసు సుదర్శన్ మాట్లాడుతూ… మా తాత,ముత్తాతల పూర్వ కాలం నుండి ఇక్కడే జీవిస్తున్నామని అన్నారు.

నేతకానీలు వలసవాదులు కాదని,బ్రతకడం కోసం అడవిని నరికి పోడు వ్యవసాయం చేస్తూ అడవిలో దొరికే దుంపలు,పండ్లు,ఫలాలు,
ఆకులు అలమలు తింటూ అడవి ఉత్పత్తులైన చీపుర్లు,కోపిరి,ఇప్పపూలు,ఇప్ప గింజలు,తునికి ఆకు,తునికి పండ్లు,పాల పండ్లు,తవిసి బంక,మురళి బంక,తవిసి నార,నర్ర మామిడి చెక్క,మురళి పండ్లు,పూసుకు పండ్లు,మారేడు కాయలు,కరక్కాయలు,సిల్లగింజలు,జిబిలిక పండ్లు,పరిక పండ్లు,రేగు పండ్లు లాంటి వాటిని సేకరించి వస్తుమార్పిడి ఇతర పద్దతుల ద్వారా అమ్ముకొంటూ జీవనం సాగించామని తెలిపారు.
ప్రస్తుతం వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నామని అన్నారు.కావున అర్హులైన నేతకానీలకు పోడు హక్కులు కల్పించాలని అన్నారు.

అనంతరం సెక్రెటరీ సాయి క్రిష్ణ మాట్లాడుతూ… ప్రభుత్వ నిభందనల ప్రకారం గిరిజనులైతే 2005 నుండి సాగులో ఉండాలని,గిరిజనేతరులు అయితే మూడు తరాల నుండి స్థిర నివాసులై ఉండాలని పోడు హక్కుల చట్టం ప్రకారం అర్హులైన వారికి న్యాయం జరుగుతుందని అన్నారు.
కావున మల్లారం గ్రామ ప్రజలందరూ సంయమనంతో అధికారులకు సహకరించాలని అన్నారు.
తరువాత బీట్ ఆఫీసర్ బి. రవిందర్ మాట్లాడుతూ… పోడు భూముల దరఖాస్తుల పంపకం,పోడు హక్కులపై అవగాహన సదస్సులు ముగిశాయని,నవంబర్ 11వ తారీకునుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని,తదనంతరం ప్రభుత్వ అధికారులు పోడు భూములను డిజిటల్ సర్వే(శాటిలైట్ ఛాయాచిత్రాలు) ద్వారా సర్వేచేసి చట్ట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ప్రజలు అపోహలు నమ్మవద్దని,
మల్లారంలో అర్హులైన నేతకానీలు ఉంటే న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారని గుమాసు సుదర్శన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జాడి కిరణ్, జిమ్మిడి సుమన్,గుమాసు లక్ష్మణ్,జాడి సతీష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube