బీజేపీ నాయకుడి తుపాకీ లైసెన్స్ రద్దు
టీ మీడియా,మార్చి 20,రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ సెక్రటరీగా కొనసాగుతోన్న రెడ్డబోయిన గోపీకి పోలీసులు షాకిచ్చారు. గోపీ తుపాకీ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం రాత్రి బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ తలెత్తెంది. ఈ సమయంలో అక్కడే ఉన్న గోపీ వద్ద తుపాకీ కనబడింది.ఈ క్రమంలో గోపీపై ఎల్లారెడ్డిపేట పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిణామాల మధ్య గోపీ తుపాకీ లైసెన్స్‌ను రద్దు చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గోపీపై 143, 341, 353 r/w 34 IPC సెక్షన్లతో పాటు 307, 448, 148 r/w 149 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.
Also Read : లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మండలి చైర్మన్
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube