లింగాల కమల రాజ్ విజయాన్ని కోరుకుంటూ

గ్రామంలో మోకాళ్ళతో నడిచిన "గుర్రం వెంకటేశ్వర్లు"

0
TMedia (Telugu News) :

లింగాల కమల రాజ్ విజయాన్ని కోరుకుంటూ

– గ్రామంలో మోకాళ్ళతో నడిచిన “గుర్రం వెంకటేశ్వర్లు”

టీ మీడియా, నవంబర్ 27, బోనకల్ : బోనకల్ మండలం గార్లపాడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షులు గుర్రం వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు గారి విజయాన్ని కోరుకుంటూ సోమవారం నాడు ముందుగా ఎస్సీ కాలనీలో ఉన్న సినిమా హీరో సోనుసోదు విగ్రహం ముందు నుంచి మేరీమాత విగ్రహం వరకు మోకాళ్ళ యాత్ర ప్రారంభించారు.అక్కడి నుంచి గ్రామంలో ఉన్న బొడ్రాయి వరకు మోకాళ్ళతో నడిచి కొబ్బరికాయ కొట్టి జై తెలంగాణ అని నినాదాలు ఇచ్చారు.ఆ తరువాత గ్రామంలో ఉన్న శ్రీకృష్ణుని దేవాలయం,ముత్యాలమ్మ దేవాలయం,మరియు మసీద్ దేవాలయం నాగదేవత గుడి వరకు మోకాళ్ళతో నడవడం జరిగింది.మోకాళ్ళ యాత్ర ముగించుకొని ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్ రాజు విజయాన్ని కాంక్షిస్తూ ఈరోజు మా ఊర్లో మోకాళ్ళ యాత్ర ప్రారంభించామని అన్నారు.మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేసి తీరుతామన్నారు.అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అందించేలా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తామన్నారు.ఆరు నెలలకు ఒకసారి చట్టపు చూపుగా మధిర వచ్చి వెళుతున్న బట్టి విక్రమార్కను చిత్తుగా ఓడిస్తామని అన్నారు.

Also Read : బాండ్ పేప‌ర్లంటూ కాంగ్రెస్ మొసలి కన్నీళ్లు

నియోజకవర్గ ప్రజల చల్లని దీవెనలు అందించి కారు గుర్తుపై ఓటు వేసి కమల్ రాజ్ ని గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కేతినేని సత్యనారాయణ,గ్రామ ఎంపీటీసీ మొక్కపాటి అప్పారావు,ముఖపాటి వీరయ్య,తడికమల్ల పెద్ద కృష్ణ, గుర్రం వేణు,గుర్రం విష్ణు,తడికమల్ల చిన్న కృష్ణ,కంపల్లి కృష్ణ,కట్ల రాజయ్య, కట్ల నాగేశ్వరరావు, కనకపుడి సుధాకర్,గొల్లమందల రాజారావు,వెంకులు,చాట్ల రాములు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube