నేటి బాలలే రేపటి పౌరులు అని మరిచితిరా

గురుకులాల్లో ఏం జరుగుతుంది.

1
TMedia (Telugu News) :

నేటి బాలలే రేపటి పౌరులు అని మరిచితిరా?

గురుకులాల్లో ఏం జరుగుతుంది.?

పోషక విలువలు తో కూడిన ఆహారం అందుతుందా…..

టీ మీడియా అక్టోబర్ 31 అశ్వారావుపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దారిద్య రేఖకు దిగువున ఉన్న పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ముఖ్య లక్ష్యంతో రాష్ట్రం లోని అన్ని నియోజకవర్గ ల్లో అన్ని మండలాలకి కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యానికి అందుబాటులో ఉండే విధంగా గురుకుల పాఠాశాలలను ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే! ఒకప్పుడు నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్, సైనిక్,గురుకుల పాఠశాలలు అంటే అందులో సీటు రావాలి అంటే చాలా గొప్ప విషయం! ఎందుకంటే అక్కడ విద్యార్ధులకు చదువు ప్రామాణికలుగాని,సౌకర్యాలు గాని క్రమశిక్షణ విలువలు గానీ ఆ స్థాయిలో ఉండేవి.అక్కడ చదివితే ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా వచ్చేది.ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు,జిల్లా స్థాయి లో ఉన్నా అధికారులు, కలెక్టర్ లు కూడా గురుకుల ల్లో చదువు కున్న వారు ఉన్నారు. చాలా సందర్భంలో స్వయంగా వారే మీడియా ముందు తెలిపిన సంఘటనలు కోకొల్లలు, అలా ప్రజలు నమ్మే స్థాయిలో ఆ గురుకుల పాఠశాలలు ఉండేయి, అనటం లో ఎటువంటి అతిశోయోక్తిలేదు.అందుకనే గురుకులాలు అంటే ఒక మంచి అభిప్రాయం ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజల్లో ఉంది.

Also Read : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

దాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ప్రజల చిన్నారులకు మెరుగైన విద్యను అందించాలని సదుద్దేశంతో మైనార్టీ,గిరిజన, బీసీ బడుగు బలహీన వర్గాలు వారి పిల్లల విద్యను స్వయంగా తానే నాయకత్వం వహించి రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలను అన్ని నియోజకవర్గ కేంద్రాలలో, అలాగే రవాణా కి అందుబాటులో ఉన్న మండల కేంద్రాలలో, ఆయా సామాజిక పరిస్థితులను అనుగుణంగా గురుకుల పాఠశాల లను నిర్మిచటం జరిగింది. ఈ పాఠశాలలో సకల సౌకర్యాలతో నిధులు కేటాయించి, ఉపాధ్యాయ ఖాళీలను కూడా భర్తీ చేస్తూ, ప్రతి ఏటా కూడా ఆశక్తి ఉన్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ అన్ని రంగాల్లో సామర్ధ్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులను ఇందులో ఎంపిక చేసి ఆయా పాఠశాలలో పరిమితి కలిగిన స్థానాలను భర్తీ చేస్తున్నారు.అప్పటి వరకు బొద్దు రకం బియ్యతో పిల్లలకు అన్నం వండి పెట్టేవారు.దానికి చమరగీతం పాడుతూ గురుకులల్లో,అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం లోకూడా సన్న బియ్యంతోనే నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఇంతవరకు భాగానే ఉన్నా విద్యార్దిని విద్యార్దుల కి అందించే పోషక ఆహార విలువలు కాపాడుతున్నరా అంటే అది ఏ మాత్రం సాధ్యం కావటం లేదని ఘంట పదంగా చెప్పవచ్చు.ఎందుకంటే తెలంగాణ లో చాలా గురుకలాల్లో వండిన ఆహరం తిని విష పూరితం అయ్యి విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యి నా సంఘటనలు రాష్ట్రం లో పలు చోట్ల పలు మార్లు చూశాం. ముఖ్యంగా పిల్లలకు సన్నబియ్యం అందిస్తూ ఇన్ని గ్రాములు మాత్రమే పిల్లలకు ఆహారం ఇవ్వాలని అనే సంప్రదాయాన్ని చరమగీతం పాడుతూ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి,పోషక విలువలతో కూడిన నిత్య ఆహారపు విధానాన్ని ప్రవేశ పెట్టారు.

ఆ విధంగా నిత్యం పోషక విలువలతో కూడిన ఆహారం పిల్లకు అందుతుందా అంటే లేదనే చెప్పవచ్చు? కానీ తెలగాణా ప్రజల పేద విద్యార్దిని విద్యార్దుల పై ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉన్న ప్రేమను తప్పుపట్టలెం! ఆయన ఆదేశాలను దిగువ స్థాయి అధికారులు తుంగలో తొక్కుతున్నారు అని తేట తెల్లం అవుతుంది.క్షేత్ర స్థాయిలో తనిఖీలు ఉండవు.ఈ గురుకులాల్లో చదువుకుంటున్న పిల్లలకు సరైన విద్య అందుతుందా?పోషక విలువలతో కూడిన నిత్యం అందించే ఆహారపు నియమావళి సరిగా జరుగుతుందా? అనే విషయంలో పలు అనుమానాలు తావిస్తున్నది. ముఖ్యంగా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని బీసీ గురుకులాల పాఠశాలలో జరిగిన ఉదాంతమే దీనికి నిదర్శనం. సరైన ఆహారం ఇవ్వడం లేదని ఓ బాలుడు మీడియా ముందు తన ఆవేదనను వెలబుచ్చుకోగా దానిని సహించలేని విద్యకు కానీ, పోషక ఆహారం కు కానీ, సంబంధం లేని ఉద్యోగి,శారీరక దృఢమైన శక్తిని కలిగించే ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు దీనిపై కోపించి ఆ విద్యార్థిని దండించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు ఈ విషయం లో జోక్యం చేసుకోవడం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.అంటే అందరూ ఇక్కడ ఒకటై ఈ తతంగం అంతా చేస్తున్నారా, ఇంత జరుగుతున్నా జిల్లా, మండల విద్య శాఖ నిద్రపోతుందా,లేదా వారికి కూడా ఈ పాపంలో భాగస్వాములు అయ్యారా?. అదే విధంగా మండల వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకంలో విద్యార్థిని విద్యార్థులకు సరైన పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నారా లేదా దీనిపై పలు అనుమానాలను తావిస్తుంది.

Also Read : జూబ్లీహిల్స్‌లో పట్టుబడిన రూ.89.92 లక్షలు

తెలంగాణలో ఈ మధ్య తరచూ జరుగుతున్న సంఘటన లు కూడా ఈసందర్భం గా గుర్తు చేసుకోవచ్చు.ఈ క్రమంలో ఆదివారం ఈ సంఘటన కు స్పందించి గురుకులల రివిజన్ కో ఆర్డినేటర్ లక్ష్మి గురుకులాన్ని సందర్శించారు.తల్లిదండ్రులతో,విద్యార్థుల తో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు.చిన చిన సంఘటన లు జరుగుతుంటాయి అని,పాఠశాల భవనం కూడా మార్చవలసిన అవసరం ఉందని ఈ సంఘటన పై ఉన్నతాధికారుల కు నివేదిక అందిస్తానని ఆమె అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రతి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు, ఆ గ్రామానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఆ మండలానికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీ నాయకులు.స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు,నిత్యం ప్రజలకు,ప్రజాప్రతినిధులకు,అధికారులకు మధ్య వారధిగా ఉండే ఎలెక్ట్రానిక్ & పత్రిక పాత్రికేయులు పూర్తిస్థాయిలో స్పందించి ఆయా గురుకుల పాఠశాలలను,మన గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై ఎప్పటికప్పుడు సందర్శించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం అని అది మన బాధ్యత అని, ఈ సందర్భంగా టీమీడియా కోరుతుంది.ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు జైహింద్.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube