బందీల దొడ్డిలా గురుకుల కళాశాల

హాస్టల్ ను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు

1
TMedia (Telugu News) :

బందీల దొడ్డిలా గురుకుల కళాశాల

-హాస్టల్ ను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు

టీ మీడియా, సెప్టెంబర్ 7, వనపర్తి బ్యూరో : విద్యార్థులు కొందరు ఫోన్ చేయడంతో ఐక్యవేదిక నాయకులు జ్యోతిరావు పూలే బీసీ అతిథి గృహాన్ని బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిజిల్లా చిట్యాల గురుకుల కళాశాల,నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి గురుకుల కళాశాల,గద్వాల జిల్లా కేటిదొడ్డి గురుకుల కళాశాల కలిపి వనపర్తిలో రెండంతస్తుల భవనంలో ఏర్పాటుచేశారన్నారు.

Also Read : రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడి

విద్యార్థులు నేలపైనే కూర్చుని భోజనం చేస్తున్నడంతో ఇబ్బంది కలుగుతున్నాయని చెప్తున్నారు. నేలపైనే పడుకోవడంతో గచ్చు నేల పైన పడుకోవడంతో ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని విద్యార్థులు చెప్తున్నారు.
హాస్టల్ గదిలోనే క్లాస్ రూమ్ ఉండడం వలన ఆక్కడే ట్రంకు పెట్టెలు అక్కడే బట్టలు అక్కడే అన్ని సామాన్లు మధ్య క్లాస్ రూమ్ ఉండడం వలన అసౌకర్యాలు కలుగుతున్నాయని విద్యార్థుల రోధన.ఇక్కడ గమనించిన విషయాలు కలెక్టర్ కి మంత్రికి పై అధికారులకు తెలియజేసి వీరికి అవసరమైన వసతులు వెంటనే కల్పించాలని ఐక్యవేదికనాయకులుడిమాండ్ చేశారు.

Also Read : పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి వేముల రామూర్తి.

ఈ విషయాలను వెంటనే పరిగణలోకి తీసుకుని విద్యార్థుల అసౌకర్యాన్ని తొలగించి వారికి సరైన సౌకర్యాలు కల్పించకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఐక్యవేదిక హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ ,ఉపాధ్యక్షులు వెంకటేష్, జయ రాములు, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కార్యదర్శి రమేష్, అడ్వకేట్ ఆంజనేయులు, సభ్యులు సతీష్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube