నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న పోలీసులు

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న పోలీసులు

1
TMedia (Telugu News) :

నిషేదిత పొగాకు ఉత్పత్తులు పట్టుకొన్న పోలీసులు
టీ మీడియా,మార్చి 20,రామగుండం: పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లోనీ చింతల పల్లి గ్రామం లో ఒక ఇంట్లో  నిషేదిత పొగాకు ఉత్పత్తులు నిల్వ ఉంచి అమ్ముతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు సీపీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, ధర్మారం మహిళ ఎస్ఐ అశ్విని,ధర్మారం పోలీస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది చంద్రశేఖర్ మహేందర్,రవి,సునీల్ తో కలిసి శనివారం బుర్ర రవి గౌడ్ ఇంట్లో లో తనిఖీ నిర్వహించగా 1,09,320 రూపాయల విలువ గల ప్రభుత్వ  నిషేదిత పొగాకు ఉత్పత్తులు  లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని బుర్ర రవి గౌడ్,చింతలపల్లి,ధర్మారంఅనే వ్యక్తి నీ అదుపు లోనికి తీసుకుని నిషేధిత పొగాకు ఉత్పత్తులు ఎక్కడి నుండి ఎవరు సరఫరా చేస్తున్నారని అడుగగా మారాల సంపత్,నరసింహుల పల్లి ధర్మారం తీసుకోని వచ్చి తన ఇంట్లో పెట్టాడు అని తెలపడం జరిగింది.తదుపరి సంపత్ ను విచారణ చేయగా వినయ్ తపాలాపూర్ గ్రామం జన్నారం మండలం అనే వ్యక్తి నిషేధిత పొగాకు ఉత్పత్తు లు ఇచ్చాడు అని తెలుపడం జరిగింది. విచారణ నిమిత్తం ధర్మారం పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.

Also Read : మల్లు స్వరాజ్యం కన్నుమూత

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube