గ్యారా నెంబర్ భారీ గోల్ (జి)మాల్
గ్యారా నెంబర్ భారీ గోల్ గ్యారా నెంబర్ భారీ గోల్ (జి)మాల్


గ్యారా నెంబర్ భారీ గోల్(జి)మాల్
-నకిలీ బ్రాండ్ స్టిక్కర్లు
-అనుమతి లేని కట్టడం లో అక్రమము
-నగర శివారు కేంద్రంగా కోట్లు దందా
టీ మీడియా, జనవరి 23, ప్రత్యేక ప్రతినిధి:.నగరానికి పూర్తి శివారు ప్రాంతం,అక్కడికి వెళ్ళే మార్గం కూడా సక్రమంగా లేదురహదారి ప్రక్కన ప్రమాదకరమైన గొయ్యి.అన్ని దాటుకుని అక్కడి కి వెళితే అనుమతులు ల్లేని నిర్మాణం గ్యారా (11)నెంబర్ గౌడాన్ ఉంటుంది.అందులో 100 మందికి పైగా ఆడ, మగ వారు పని చేస్తారు నిత్యం.వారు చేసేది వస్త్రాలు కు ఉన్న స్టిక్కర్ తీసి కొత్త స్టిక్కర్ వేయడం.కోట్ల రూపాయల నయా దందా చేస్తూ జనాన్ని మోసం చేస్తున్న అధికారులెవరు అటువైపు కన్నెత్తి చూడరు ఖమ్మం నగర శివార్లు లో జరుగుతున్న ఈ దంద పై టి మీడియా ప్రత్యేక కథనం….
నగరం నడి బొడ్డు న ఏర్పాటు చేసిన ఈ షాప్ లో అన్ని రకాలు ఒక్క చోటకొనుకోవచ్చు అని జనం ఎక్కువ గా వస్తారు. ఆ క్రేజీని అవకాశం తీసుకొన్న యాజి మన్యం నిలువు దోపిడీకితెరలేపింది.నిబంధనలు కి నీళ్లు వదిలి ,చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. షాప్ నిర్వహణలోలేని వాలెట్ పార్కింగ్ బోర్డుపెట్టినిబంధనలు అతిక్రమించి మున్సిపల్ రోడ్డు పార్కింగ్చేశారు.పాదాచారులు నుకూడాఇబ్బందిపెడుతున్నారు. కరోన నిబంధనలు మచ్చు కైనా కనిపించవు.కార్మిక చట్టాలను ఉల్లంగిస్తూ కనీస సో కార్యాలు సిబ్బంది కి కల్పించడం లేదు. ప్రశ్నిస్తే ఉద్యోగం నుండి తొలగించడాం చేస్తున్నారు.అన్నింటికీ మించి లేని బ్రాండ్లు పేరుతో స్టిక్కర్లు ను ముద్రిచేయించి వాటిని వస్త్రాలు పై వెయిస్తున్నారు ఇది పూర్తిగా చట్ట విరుద్ధం అయిన పని.వినియోగ దారుడుని బహిరంగ మోసం చేస్తూ కోట్లు దండుకొంటున్నారు.అయిన తూనికలు కొలతలు,కార్మిక శాఖ,జిఎస్టి అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం అనుమానం కలిగిస్తుంది.
*అనుమతి లేని నిర్మాణం లో
గోదాం నిర్మాణం చెయ్యాలి అంటే పోలీస్,ఫైర్ క్లియరెన్స్ తో పాటు మున్సిపల్ అనుమతులు కావాలి. ఇవి ఏవి లేకుండ అక్రమ పద్దతుల్లో కాయితా లు సృష్టించి ,కరెంట్ కనెక్షన్ పొందిన 11 వ నెంబర్ గోదాం గా పేరున్న షెడ్డులో అక్రమ బ్రాండెడ్ వ్యాపారం నిర్విరామంగాసాగుతోంది.అక్కడ అయితే ఎవరు పెద్దగా అటు వెళ్ళరు అని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ షెడ్డులో అనుకోని ప్రమాదం జరిగితే 10 ల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.అక్కడున్న సరుకు అగ్నికి ఆహుతి అయితే వచ్చే పొగ విషవాయివు గా మారి ఆప్రాంతం లో వందల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది అయిన అధికారు ల్లో చలనం లేదు.
జన వాసాలు మధ్యకు మార్పు
త్వరలో ఈ అక్రమ కేంద్రాన్ని నగరం లోని మామిళ్ల గూడెం లో ఉన్న జన వాసాలు మధ్యకు యాజమాన్యం తరలించే ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది.నివాసం అంటూ అనుమతులు తీసుకొని నిర్మాణం చేసిన ఈ భవనం లో వాణిజ్య కార్యక్రమాలు కు అది కూడా అక్రమ ,ప్రమాదభరిత వ్యాపారం కోసం వినియోగించే ప్రయత్నం లో ఉన్నారు.(మరికొన్ని వివారాలు తో పాటు పరుచూరి పక్కమోసం మరో కధనం లో)
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube