కిట్స్ కళాశాలలో హ్యాకథన్ -2022 ముగింపు

ముఖ్య అతిధిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ -విశిష్ట అతిధిగా పాలేరు ఎమ్యెల్యే కందాల

1
TMedia (Telugu News) :

కిట్స్ కళాశాలలో హ్యాకథన్ -2022 ముగింపు

-ముఖ్య అతిధిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ -విశిష్ట అతిధిగా పాలేరు ఎమ్యెల్యే కందాల

-80 కిలో వాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభం

టి మీడియా,ఎప్రిల్ 30,ఖమ్మం రూరల్ :మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు విజ్ఞాన వికాసానికి సాంకేతికకు దోహదపడే హ్యాకథన్ – 2022 కార్యక్రమం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు ప్రత్యేక అతిధిగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ముందుగా కిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన 80 కిలో వాట్ సోలార్ ప్లాంట్ ని మంత్రి ప్రారంభించారు. 36 గంటల పాటు నిరంతరముగా 112 టీములు 112 ప్రాజెక్ట్ ల పై శ్రమించారు. అత్యుత్తమము గ నిలిచినా టాప్ 3 ప్రాజెక్టులను చేసిన విద్యార్థులకు ప్రశంస పత్రం మరియు సర్టిఫికేట్ ల ను మంత్రి అందచేశారు. మొదటి బహుమతి “విజిబుల్ సోలార్ ఎనర్జీ”, రెండవ బహుమతి “వర్చువల్ రియాలిటీ ఫోబియా ట్రీట్మెంట్”, మూడవ బహుమతి “స్మార్ట్ రెఫ్రిజిరేటర్ ” అనే ప్రాజెక్ట్ అంశాలు గెలుపొందాయి.

Also Read : మంత్రి పువ్వాడ మేడే శుభాకాంక్షలు

మంత్రి మాట్లాడుతూ ఇటువంటి అద్భుత సృజనాత్మకత ను కలిగించే కార్యక్రమాన్ని విజయవంతం గ నిర్వహిస్తున్న కిట్స్ యాజమాన్యాన్ని అభినందించారు. తెలంగాణ రాష్ట్రం లో IT లక్ష అరవై వేల కోట్లు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుందని, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్నత IT సంస్థలలో ఉద్యోగాలకు మరియు సొంతం గ సంస్థలను స్థాపించే స్థాయి కి ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని, హైదరాబాద్ బెంగుళూరిని మించి ఐటిసిలికాన్ వాలీ అవ్వాలని తెలిపారు. ఇలాంటి స్రుజనాత్మక ఆలోచన నుంచే నేడు జమోటోసంస్థ వృద్ధి చెందిందని తెలిపారు.

Also Read : సబ్ జైల్ ను సందర్శించిన జడ్జి

విశిష్ట అతిధి కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ కిట్స్ విద్యార్థులకు మంచి కంపెనీ లలో ప్లేసెమెంట్స్ కల్పించేందుకు కృషి చేస్తామని, కళాశాలలో పెద్ద IT కంపెనీలు ప్లేసెమెంట్లు చేపట్టేందుకు కృషిచేస్తామని, విద్యార్థుల ఉన్నతి కి సహకారిగా ఉంటానని తెలిపారు.
ఈ 36 గంటల హ్యాకథన్ – 2022 కార్యక్రమం లో కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ కోట అప్పిరెడ్డి, చైర్మన్ ఎం నిరంజన్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి కృష్ణమూర్తి, కళాశాల విభాగాల హెచ్ఓడి లు, టి ట వ్యవస్థాపకులు ఎం సందీప్ కుమార్, ఐటీ నిపుణులు, జీహెచ్ యూ బి నిర్వాహకులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube