కిట్స్ కళాశాలలో ఘనంగా హ్యాఖతాన్ 2022 ప్రారంభం

కిట్స్ కళాశాలలో ఘనంగా హ్యాఖతాన్ 2022 ప్రారంభం

1
TMedia (Telugu News) :

కిట్స్ కళాశాలలో ఘనంగా హ్యాఖతాన్ 2022 ప్రారంభం

టి మీడియా,ఎప్రిల్ 29,ఖమ్మం రూరల్:

కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలోశుక్రవారం ఇంజనీరింగ్ విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఉపయోగ పడే 2 రోజుల నిరంతర కార్యక్రమం హాకతాన్ 2022 ప్రారంభమైనది. ఈ కార్యక్రమాన్నితెలంగాణలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ స్థాపకులు మరియు డైరెక్టర్ “సందీప్ కుమార్ ముక్తాల ” ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు, కేంద్రప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ ఇండియా కార్యక్రమాల్లో భాగంగా కొత్త కొత్త పరిశోధనలకు, సాంకేతికతను, సృజనాత్మకతను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం జేహబ్ ఏర్పాటు చేసి కొన్ని కళాశాలలో మాత్రమే చేపట్టుతున్న కార్యక్రమంకిట్స్ కళాశాలలో నిర్వహణ జరుగుతుంది, విద్యార్థులు 36 గంటలపాటు 70 బృందాలుగా ఏర్పడి ప్రతి ఒక్క బృందం ఒక కొత్త ఆలోచనను తీసుకొని వివిధ సాంకేతిక సామజిక, సమస్యలకు పరిష్కరణ జరుగుతుంది. టి టా స్థాపకులు మాట్లాడుతూ కిట్స్ కళాశాలో జరిగే ఈ హ్యకతన్ కిట్స్ విద్యార్థుల్లో సృజనాత్మకతకు ఒక వేదిక అవుతుందని కిట్స్ యాజమాన్యాన్నిప్రసంశించారు.

Also Read : తెలంగాణా లో మరో మూడ్రోజులు వర్షాలు

మరొక అతిధి డాక్టర్ రామకృష్ణ ప్రసాద్, జేఎన్ టి యు డైరెక్టర్, మాట్లాడుతూ విద్యార్థులు ఎదగాలంటే ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని, మంచి ఆలోచనలను కలిగి ఉండాలని తెలిపారు.ఈ 36 గంటల హాకతాన్ 2022 పాల్గొన్న విద్యార్థులకు వివిధ దేశాలకు చెందిన నిపుణులు సూచనలను తెలుపుతారు, మరియు ప్రత్యక్షంగా “డాక్టరు శిరీష – డైరెక్టర్ ప్రాక్టీసెస్ ” అహ్మద్ అమీర్ ఇంటర్నేషనల్, అమిత్ – ఫ్యూచర్ స్కిల్స్ మొదలగు నిపుణులు ప్రత్యక్షంగా విద్యార్థులకు మార్గదర్శకత చేస్తారు.36 గంటల అనంతరం వినూత్నంగ ఉన్న పరిశోధనలును జే హబ్ వారు అభివృద్ధి చేస్తారు.ఈ కార్యక్రమం లో కళాశాల సెక్రటరీ కరెస్పాండంట్ కోట అప్పిరెడ్డి, చైర్మన్ ఎం నిరంజన్ రెడ్డి, కిట్స్ ప్రిన్సిపాల్ పన్నాల కృష్ణమూర్తి వివిధ విభాగాల హెచ్ ఓడి లు విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube